పుట:Andhra-Bhasharanavamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బరిసరంబుగఁ దోఁచు వరసంది చేరువ కట్ట కత్తువ కర గనిమ యనఁగ
సేతువిశేషంబు చెలఁగును మడువనాఁ బుట్టన వల్మీక మొప్పుచుండుఁ
గోమ యనఁ దదగ్రభూమి యౌ మార్గంబు తెరువు త్రోవ చారి తేన్ను సరవి
చనుప సడవ చొప్పు జాడ డొంక యనంగఁ బొలుచుచుండు మాతృభూతలింగ.

8


సీ.

బాట యనంగను బండిబా టనఁ దగు ఘంటాపథము దోఁచుఁ గాలిత్రోవ
యన నేకపది గిర్య యన మొప్పు నరవ నా నుపనిష్కురం బొప్పు నుక్కళ మనఁ
బరఁగు మెట్టనఁ గూఁతపట్టునేల యనంగఁ గూడనేల యనంగఁ గ్రోశ మదియె
పరుపునేల యటంచుఁ బలుకుదు దీకపు లిరుపర్వునేల ముప్పరువునేల
యనినఁ గ్రోశద్వయత్ర యాఖ్యలు చెలంగు నామడ యనంగ యోజనం బగును గనుమ
యనినఁ గాంతార మగు లవణాకరంబు వెలయం నుప్పల మనఁగను వేదవేద్య.

9


తే.

శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగ భూమివర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్ప్రయీమాతృభూత.

10

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

పురవర్గము

ఆ.

ప్రోలు వీడు నాఁగఁ బురసంజ్ఞ లై యొప్పుఁ, గంచినాఁగ నోరుఁగల్లు నాఁగఁ
దిరిచనాపలి యనఁ బురవిశేషము లగు, వాడ యనఁగ వాటి వఱలు నభవ.

11


సీ.

అంగడి మలిగనా నాపణసంజ్ఞ లౌఁ బేట యం చనఁగను విపణి యొప్పు
రచ్చనా రథ్యయౌఁ బ్రాకార మగుఁ గోట యన నుపసాలాఖ్య యగు నరాబు
వా నలంగంబన నలవరి నా పప్ర మగును సాలావయవాఖ్య కొత్త
ళ మ్మన వరణశృంగ మ్మగుఁ గొమ్మనాఁ బ్రాచీనసంజ్ఞలు పరఁగుచుండు
వెలుగు కల్లి యనంగను వలవ యనిన వల్లికాస్యూతవృతి భిత్తి పరఁగు గోడ
యనినఁ దృణముఖ్యకృతిభిత్తికాఖ్య చెల్లు దడి తడిక తడు కనఁగను దక్షశిక్ష.

12


సీ.

పొరకటి యిడుపు నాఁ బొసఁగు ద్వారప్రాంతకుడ్యము మదురు మగలనఁ గుడ్య
పాలికయై యొప్పు భాసిల్లు గృహసంజ్ఞ దీము దీమం బిల్లు గీ మనంగఁ
దావన ఠావనఁ దానకం బనఁగను దావలం బనఁగను దలముపేరు
లిరవు ప ట్టిమ్ము చో టిక్కువ నెల విక్క నెప్పు కంగవ టెంకి నిట్ట యనఁగ
స్థాన మగు నగ రనఁగ రాజగృహనామధేయ మా రాణివాస మంతిపుర మనఁగ
నలరు శుద్ధాంత మట్టడి యనఁగ నట్ట మలరుఁ దగు శాల కొట్టమం చనఁగ నభవ.

13


సీ.

హాజారము హజార మనునివి రెండును మోసాల మొగసాల మోస లనెడి
నివిమూఁడు నంతైదు నెసఁగును ముఖశాల కలరుఁ ద్రిశాలాఖ్య యగును జేట