పుట:Ananthuni-chandamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తాతంభొట్లు మతమున 13 తర్వాత.

2. కవిరాజవిరాజితము:— అప్పకవి మొదలయినలాక్షణికులందరిమతమున. పాదాక్షరములలో 8 వది,14 వది, 20 వది మొదటి అక్షరముతో మైత్రి కలవి.

కవిజనాశ్రయములో(చూ. పు. 49) రెండవ పాదమున “ కామనిభా” అనుచోటమాత్రము వడి తప్పినది. గాని, అప్పకవి మొదలయినవారు చెప్పినట్లే ఉన్నది.[1]

కంకంటి పాపన మొదలయిన కవులు కొందరిట్లే వడి పాటించివారు. గాని నన్నయ, పెద్దన, జక్కన మొదలయినవారు కొందరు పాదమధ్యమున ఒక్కచోటనే వడి పాటించినారు.

3. మధ్యాక్కర: — లాక్షణికులందరును మూడుగణముల తర్వాత వడి నియమించినారు. నన్నయ ఒక్కడే నాలుగుగణముల తర్వాత వడి

  1. జయంతి రామయ్యపంతులుగారిచే పరిశోధితమై ఆంధ్రసాహిత్యపరిషత్తువారిచే ప్రకటితమైనప్రతిలో “కామనిభా” అని ఉన్నది; గాని నావద్దనున్న ప్రతిలో “రామనిభా” అని ఉన్నది. పరిష్కర్తలు తమవద్ద నున్న ప్రతులలోని పాఠము నిచ్చివారుకాబోలు. కవిజనాశ్రయములో వడి గురించి లక్షణమున ఏమి చెప్పియుండలేదు; గాని లక్ష్యలక్షణపద్యములో అప్పకవి చెప్పినట్లు మొదటిపాదమున వళ్లు ఉండడము చేత రెండవపాదమునకూడా అట్లే ఉండవలెనని తోచును.