పుట:Ananthuni-chandamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వృత్తములలో ఎక్కడెక్కడ విశ్రాంతి ఉండవలె నని చెప్పినారో ఆవృత్తములకు సరియైన తెలుగుపద్యములలో ఆయాస్థలములందే వడినియమము సాధారణముగా ఉన్నది; గాని, చాలాచోట్ల తప్పినది. ఉదాహరణములు:

1. భుజంగ ప్రయాతము:-- సంస్కృతమున 6 అక్షరములు తర్వాత[1] తెలుగున 7 తర్వాత వేదము వేంకటరాయశాస్త్రులవారు సంస్కృతపండితులు గనుక సంస్కృతనియమమే పాటించినారు.

2. పంచచామరము: సం. 8; తెలుగు 9.

3. శిఖరిణి:—సం. 6; తె. 12.

4. ఆర్యాదిజాతులు:—చూడండి; మూలము III. 3. 4.

తెలుగుపద్యములలోసే వళిస్థలముల గురించి లాక్షణికులలోను కవులలోను మతభేదమున్నది. చూడండి:—

1. పృథ్వి:— సంస్కృతములో 8. ఈమర్యాద ననుసరించినవారు పెద్దన. అప్పకవి, అనంతుడు, విన్నకోట పెద్దన కవిజనాశ్రయకర్త వీరి మతమున 11 తర్వాత. ఈనియమమును నన్నయ రామరాజభూషణుడు మొదలయిన వారు పాటించినారు.

  1. కొందరు లాక్షణికులు ఎన్ని అక్షరములయిన తర్వాత వడి ఉండునో ఆసంఖ్య తెలియజేతురు. కొందరు ఎన్నవఅక్షరము వడి గలదో ఆసంఖ్య తెలియజేతురు. సంకేతభేదమేగాని, స్థితి ఒకటే.