పుట:Ananthuni-chandamu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఇల మర్యాదాదులయం
దలియత్వం బాత్వ మై పొదలు నాద్రి యనన్‌
లలి నభివిద్యాదులయం
దలియత్వము నాత్వమై పొదలునాద్రియనన్‌.

53


గీ.

ఈషదర్థ మనఁగ నించుక యగుఁ గ్రియా
యోగ మనఁగ సత్క్రియోపయుక్తి
యంతదాకఁ యనుటయై చను మర్యాద
యదియు ననుట యర్థ మభివిధికిని.

54


క.

ఈనాల్గిట నుపసర్గయ
కానఁ గలిగె సంధి యట్లుగావు ప్రకృతిభా
వానుగతాకారము లవి
జానుఁగ దెలుగునకుఁ జొరవు సంధికలియమిన్‌.

55


క.

ప్రతిషేధాకారోత్తర
గతశబ్దాద్యచ్యు లవి నకారము లగునా
శ్రితులకుఁ బంకజనేత్రుఁ డ
నతిదూరుం డనఁగ నతఁ డనాద్యంతుఁ డనన్‌.

56

వ్యంజనసంధి—

క.

పొడవగు దిగిభ మజంతము
షడంగములు జగదరిష్టశాంతి సుబంతం
బడరె ననఁ దృతీయము లల
వడు వర్గవ్యంజనములపై నచ్‌సంధిన్‌.

57


గీ.

షడృతుధర్మభూషిత తరుషండలక్ష్మి
నిర్మలాబృద్ధదీర్ఘిక నిజవిశిష్ట