పుట:Ananthuni-chandamu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పొదవు సురేంద్రుఁ డనఁగ నీ
రదోత్కరం బనఁగ సంధి బ్రహ్మర్షు లనన్‌.

47


గీ.

ఇత్వ ముత్వ మోత్వం బైత్వ మౌత్వ మైదు
నాది యై ఋకారము పరమైనచోట
మహితకవ్యృద్ధి మన్వృద్ధి మఱి ద్యవృద్ధి
యద్ది రాయృద్ధి గ్లావృద్ధి యనఁగఁ బరఁగు.

48


క.

వశగతి ఋణపద మధికపు
దశఁ బ్రవసనకంబళార్ణ దశవత్సతరా
ఖ్యశిఖిభసంఖ్యపదంబులు
రశిరస్కాకార మొంది ప్రార్ణాదు లగున్‌.

49


క.

ఐలగునేఐ లోఔ
లౌలగు నాద్యంతమునకు నఖిలైకవిభుం
డా లలితైశ్వర్యుఁడు స
త్యాలాపౌదనుఁడు భవమహౌషధ మనఁగన్‌.

50


గీ.

అత్వమున కోతు వోష్ఠమంత్యమునఁ గదియఁ
గలుగు నోత్వౌత్వయుగ్మ వికల్పసంధి
ఆడఁ జెందె ఘనోతు వల్పౌతు వనఁగ
నాఁగె బింబోష్ఠి నొక్క బింబౌష్ఠి యనఁగ.

51

అఙ్ప్రయోగచతుష్టయము—

క.

అందముగ నీషదర్థము
నం దాతుద నుత్వ మోత్వ మై యోష్ణ మగున్‌
జెంది క్రియా యోగము తుద
యందలియత్వ మది యాత్వ మాలిన మనఁగన్‌.

52