పుట:Ananthuni-chandamu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామాయనమః

ఛందోదర్పణము

చతుర్థాశ్వాసము

దోషాధికారము



ధర తనురుచివిజితప
యోధర యనవరతఘోషయోషిత్పరిపీ
తాధర తల్పీకృతవసు
ధాధర రిపుభయద ఘనగదాధర కృష్ణా!

1


క.

జగమున దోషవివర్జిత
ముగఁ జెప్పఁగవలయుఁ గావ్యమ్ములు సత్కవు ల
ట్లగుటన్‌ దశదోషమ్ములు
తగఁ జెప్పెదఁ బూర్వకవిమతంబుగఁ గృష్ణా!

2

దశదోషములు

గీ.

పదియుఁ గీడుఛందోయతిభంగములు వి
సంధికము పునరుక్తి సంశయ మపక్ర
మంబు వ్యర్థ మపార్థము మఱి విరూపి
తాపశబ్దవిరోధంబు లనఁగ గృష్ణ!

3