పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

         పట్నవాసంపిల్ల
         పల్లెటూరొస్తేను
         ఊరంత విరగబడి
         తారుమారై పోయె.

               నగరవాసంపిల్ల
               నవ్వితే ముత్యాలు
               నాట్యమాడే కళ్ళు
               నక్షత్రకాంతులే.

               నగరవాసంపిల్ల
               సొగసుదిద్దినపిల్ల
               వగలుపోయే పిల్ల
               నగవు కులికే పిల్ల.

అని పాడినాడు. వెంటనే రాగమూ వరసా మార్చి -

   “ఓ అందాలా దేవకన్యా
    చందురూనే ఎక్కిరిస్తా ?
    మందుపెట్టీ మనసూ లాగేవా?
    మాయచేసీ మాటాలాడేవా? ఓ అందాలా....

    ఓ పట్నవాసం బంగారుపిల్లా
    పల్లెటూరూ రాజ్యంచేశావా?
    ఘల్లుమంటూ గంతూ వేసేవా? ఓ అందాలా....
 
    ఓ దొంగవారీ రాచకన్నే
    దోచుతావ మనసూ ప్రాణాలూ?
    దాచుతావ మనసూ మర్మాలు ఓ అందాల....

    ఓ చిన్నారి వయసుదానా
    వన్నేల చిన్నాదానా
    ఎక్కడీవే నీకీ అందాలూ
    చుక్కల్లో తేలివచ్చావా?
    ఓ అందాల దేవకన్నే?

అని గలగల నవ్వినాడు.

ఈ పాట ఒళ్ళు పరవశం అయిపోగా విన్నది తారానిక. తా మెక్కడ ఉన్నదీ నాగదత్తునికి తెలియకూడదని యశోద నాగనిక నోరు మూసి “ష్” అని చేయితీసివేసింది.

అడివి బాపిరాజు రచనలు - 6

69

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)