పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రామాణి: నీ బలమూ, నా బలమూ మనబోటి ఇతరుల బలమూ కలిసి అతిరథత్వం అవుతుంది. నాగదత్తుడు ధనకమహారాజుకు ఆంతరంగికుడు కావడమంటే ఇంతే.

మినయ: మీ మాటలు పరమాశ్చర్యకరంగా ఉన్నవి.

గ్రామాణి: ఆశ్చర్యం ఏమిటి వినయా! మీనాన్నా నేనూ ఈ చుట్టు ప్రక్కల గ్రామాలలో పెద్దల పంచాయితీలలో సభ్యులం. మాకు తెలియదా? రాజు ప్రజాబలానికి చిహ్నం, ప్రజాధర్మానికి సేవకుడు.

వినయ: వారు ప్రతిభావంతులూ ప్రతాపవంతులూను.

గ్రామాణి: ప్రతిభేకాదు, వారిజన్నే పూర్వజన్మ సుకృతం. యజ్ఞం చేసే మహర్ని ఉద్ధండ పండితుడు కావచ్చు. కాని ఆయన యజ్ఞం చేయడానికి ఋత్విజూలూ, బ్రహ్మాకావాలి. అలాగే రాజ్యపాలనచేసే రాజుకు మనమందరం బలమూ, శక్తీ ఇస్తాము.

నాగదత్తుడు: అయితే నాన్నా! బ్రహ్మదత్తప్రభువు ఉత్తమ విద్యావంతుడైన బ్రాహ్మణుడు.

గ్రామాణి: కారని అన్నానురా, ఆయన దేశానికి రాజయి చదువుకోకుండా ఉంటే ధర్మపరుడెలా అవుతాడు? రేపు నువ్వు ప్రభువైనా అంతే. చదువు ఎక్కకపోతే గద్దె ఎక్కటం మానాలి.

'ప్రజాకంఠం మహారాజు కంఠం' అని వినయనాగుడు అనుకున్నాడు. ప్రజాబలమే మహారాజుశక్తి “మనం ఈ కాలపువాళ్లము. భవిష్యత్తు ఎల్లా ఉంటుందో బావగారూ!” అన్నాడు వినయనాగుడు నాగదత్తునితో.

“ఉత్తమభావాలు మనస్సులో ఉంచుకొని జీవితం సాగించేవారికి ఎప్పుడూ భయంలేదు బావగారూ!”

“ఎక్కడిదీ వేదాంతం బావా!”

“మా ధనకమహారాజు మహాపండితుడు, మహాకవి, వేదాంతి. ఆయన జీవితం తలచుకుంటే ఏ రామచంద్రప్రభువో జ్ఞాపకం వస్తాడు.”

“బుద్ధధర్మం యావత్తూ మరచిపోయాడు బావా!”

“శ్రీరామచంద్రుడు ఆంధ్రదైవం అంటారు మాప్రభువులు బ్రహ్మదత్తులవారు.”

“బుద్ధదేవుడు శ్రీరామచంద్రుని వంశమేనట కాదూ?”

“అవును. మనకూ ఇక్ష్వాకులకూ సంబంధం ఉంది, ఆ వంశంవారు ఇక మనకు చక్రవర్తులు కావాలి బావగారూ!”

“మీ ఆలోచన చాలా బాగుంది. 'శ్రీ శాంతిమూల మహాప్రభువును చక్రవర్తిగా ఉండుడు' అని ప్రార్థిస్తూ ప్రజలు అందరూ ఐక్యకంఠంతో కోరినారు. మహారాజు ఏమీ మాట్లాడరు.”

“శాంతిమూల సార్వభౌములకు రాజ్యక్షాంక్ష లేదు. ఎవరు చెప్పినా ఎవరు ప్రార్ధించినా వారిలో ఉన్న అనుమానం వీడటంలేదు.”

వినయనాగుడూ యశోదా తారానిక పుణ్యమా అని అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నారు. యశోద వినయనాగుని హృదయానికి మత్తు ఎక్కిస్తోంది. ఋష్యశృంగుడైనామనస్సు హరించగల మానిని వస్తే-వెన్నలా కరిగిపోతాడు.

అడివి బాపిరాజు రచనలు - 6

• 201 •

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)