పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినయనాగుడు భోజనంచేసి గదిలో కూర్చుండి వినయపీఠికం చదువు కుంటున్నాడు. పదిక్షణికాలు మంచముపై మేనువాల్చి నిదురకూరినాడు. లేచి మోము కడుగుకొని శుభ్రమైన వస్త్రాలు ధరించి పరీమళముల లందుకొని, తల దువ్వుకొని, చీనాంబరము తలకు జుట్టుకొని మంజీర కంకణ కేయూరహారమేఖలాది భూషలు ధరించి, తిలకం తీర్చి నాగదత్తునితో కలిసి పొలం వెడదామని గదిలోనుంచి బయటకు రావడానికి సిద్దంగా ఉన్నాడు. ఆ సమయంలో యశోదలోనికి వచ్చి “మీకేదో కావాలన్నారట, తారానిక పంపింది” అని తలవాల్చికొని తెలిపింది. అతడు ఆనందహృదయంతో,

“అవును వావాలి!"

“ఏమి కావాలి?”

“నువ్వే కావాలి!”

“నేనా! అమ్మో! ఇది కుట్రా!”

“ఉండు ఉండు వెళ్ళిపోకు! నిజంగా పని ఉంది. కాసిని మంచి నీళ్ళు కావాలి యశోదా!”

“వట్టినీళ్ళేందుకు. ఉపహారం పట్టుకువస్తాను వెళ్ళి!”

“త్వరగా!”

“ఏమంత త్వర?”

“షుడియలు ఘడియలు నిన్ను ఒదలి ఒంటిగా ఉండనా?”


★ ★ ★

అడివి బాపిరాజు రచనలు - 6

• 202 •

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)