పుట:Ammanudi April-July 2020.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రత్యేక వాసం

ఎన్‌. ముక్తేశ్వరరావు ఐ.ఏ.యస్‌. (విశ్రాంత) 94914 28078


ఆంగ్ల మాధ్యమం ఉత్తర్వు చెల్లదు

ఉన్నత న్యాయస్థానం తీర్చు చారిత్రాత్మకం

భాష సంస్కృతి, వాజ్మయం, పురాతత్వ శాస్త్రం లాంటి అంశాలు ఏమిటి? వాటి స్వరూప స్వభావాలు ఏమిటి? అవి సమాజంలో ఎలా పనిచేస్తాయి? ముఖ్యంగా భాష చరిత్ర నిర్మాణంలో, శాస్త్రవిజ్ఞాన వ్యాప్తిలో మానవజాతి పురోగతిలో అవి అతి పెద్ద మూలధనం. తరగని పిత్రార్జితం. భాషను ఆషామాషీగా తీసుకోవడం వల్ల అనేక సమాజాలు, దేశాలు బానిసత్వంలోకి, పరాధీనత లోకి వెళ్లిపోయాయి. భాషలు కనుమరుగయ్యాయి. జాతులు రూపురేఖలను పోగొట్టుకుంటున్నాయి.

ఏ సమాజం లోనైనా మాతృభాషలోనే విద్య విజ్ఞానాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు అలనాపాలనా ఉండాలి. మనందరి రాత బావుండక భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నాటి నుంచి ఇవాల్డి వరకు అడపాదడపా కొద్దిపాటి మినహాయింపులు తప్ప - భాష విషయంలో మన పాలకులు ఆచంట మల్లన్నలే! ఒకళ్ళ కన్నా ఒకళ్ళు ఘనులే! వీళ్ళ దృష్టిలో భాష సమాజం, దేశం, సంస్కృతుల గురించి మాట్లాడేవాళ్ళు పాత కాలం మనుషులు. ఈ నేపథ్యంలో పులి మీద పుట్ర లాగా, బొడ్డూడని వాళ్ళకి ఇంగ్లీష్‌ మీడియం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌, రాంభొట్ల శ్రీనివాస సుధీర్‌ మొదలైన భాషాభిమానులు, దేశాభిమానులు దీనిని హైకోర్టులో ప్రశ్నించారు.

ఆ సందర్భంలో హైకోర్టు మాతృభాషకు సంబంధించిన అనేక అంశాలను, వాటి అనుపానులను రాజ్యాంగం, చరిత్ర మహనీయుల ఆలోచనలు, విద్యావేత్తల తత్వ ధార వీటన్నిటి వెలుగులో పరిశీలించింది. పూర్వ చరిత్రను , పురోగతిని మాట్లాడింది. ఈ తీర్చు, భాష అనేది చాలా మంది అనుకుంటున్నట్లు కేవల భావోద్వేగం, అభిమానం లాంటి పరిమిత పరిధికి చెందినది కాదని స్పష్టం చేసింది. ఇరుకు సందుల నుంచి బయటకు తెచ్చి భాష ఎలా నిత్య అవసరమో నొక్కిచెప్సింది. శాస్త్రీయతను, మాతృభాషలను, దేశాన్ని ప్రేమించే వారందరూ శిరసా నమస్కరించి చదవదగినది ఈ తీర్చు. చదువుకుందాం ! చర్చించుకుందాం! నలుగురి చెవిన ఈ మాటలు వేద్దాం!

చాలా సందర్భాల్లో భాషా సంస్కృతులపై జరిగే చర్చలు వింటున్నప్పుడు ఏనుగు -గుడ్డివాళ్ళ కథ గుర్తుకువస్తుంది. తోక పట్టుకున్నవాడు తోకలాగా ఉందని, తొండం పట్టుకున్నవాడు తొండం లాగా ఉందని చెప్పడం జరుగుతుంది. భాషా సంస్కృతులు లాంటి విషయాలలో కేవలం ఒక వైపు మాత్రమే పరిమిత దృక్కోణంతో చూడటం సమంజసం కాదు.

దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం ఇటీవల మాతృభాష విద్యా విధానం మీద వెలువరించిన తీర్పు చాలా చారిత్రాత్మకమైనది. ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా ఒక అద్భుతమైన విశ్లేషణ చేసి దాన్ని రాజ్యాంగ నేపథ్యం నుంచి సమీక్షించి సారాంశం మొత్తాన్ని ఇమిడ్చి చెప్పిన తీర్పు ఇది.

భాషా విషయకమ్టైన సమస్త విషయాలు కూలంకషంగా పరిశీలించి సమాజానికి సమాజ భవిష్యత్తుకి కూడా సంబంధించి ఆలోచన చేయడం అనేది ఇందులో ఉన్న విశేషం. ఇదే సందర్భంలో మాతృభాష అన్న అంశంపై పిల్లలపరంగా ఆలోచించడం ఇందులో ఉన్న గొప్పతనం.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో అంటే ఒకటి నుండి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీచేసిన జిఓలు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. బొధన మాధ్యమాన్ని ఏకపక్షంగా మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పింది. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగానికి, విద్యాహక్కు చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని తెలిపింది.

ఒకటి నుండి ఎనిమిదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలని, అది పిల్లల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని కోర్టు అభిప్రాయపడింది. పిల్లలను ఏ మాధ్యమంలో చదివించు కోవాలో నిర్ణయించుకునే హక్కు తల్లిదండ్రులకు ఉందని స్పష్టం చేసింది. దీంతో ఆంగ్ల మాధ్యమం కోసం 2019 నవంబరు నెలలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్‌ 81, 85 లు రద్దయ్యాయి

'మాధ్యమాన్ని నిర్ణయించేది ఎవరూ

విద్యా సంబంధమైన ఒక కీలక విషయం బోధన మాధ్యమం. పిల్లల మనస్తత్వ శాస్త్రాన్ని ఒక ప్రత్యేక అంశంగా అధ్యయనం చేసిన వారు ఏది పిల్లలకు తగిన మాధ్యమము? వారు ఏ వయసులో ఏ మాధ్యమం ద్వారా బాగా నేర్చుకోగలరు అనే విషయాన్ని నిర్ణయించగలరు. దీనికి కేంద్ర స్థాయిలో ఎన్సీఈఆర్టీ, రాష్ట్రస్థాయిలో ఎస్సీఈఆర్టీలు ప్రధాన సంస్థలుగా పని చేస్తుంటాయి. విద్యారంగంలో వస్తున్న పరిణామాలను రావలసిన మార్సులను నిర్దేశించ వలసినది ఈ సంస్థ లే! కాబట్టి ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు పై రెండు సంస్థలలో ఉన్న పండితులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం అటువంటి ప్రయత్నంచేయకుండానే ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నందువల్ల ఇది చెల్లుబాటు కాదని కోర్టు స్పష్టంగా చెప్పింది.

ఎలా రాజ్యాంగ విరుద్ధం?

రాజ్యాంగంలో అధికరణ 19(1) భావవ్యక్తీకరణ వాక్‌ స్వాతంత్ర్యం గురించి చెబుతుంది. విద్యాభ్యాసం కూడా దానిలో

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జులై-2020

9