కొవిడ్ -19
మాదిరాజు సునీత
కరోనా: కార్పొరేట్ విధాన వైపరీత్యం!
ప్రపంచవ్యాప్తంగా కరోనా విశ్వమారి కరాళ నృత్యం చేస్తోంది. గ్లోబల్ లాక్‌డౌన్ పాటించడం వల్ల మానవ కార్యకలాపాలు కట్టడి కావడంతో భూకంపిత శబ్దం గణనీయంగా తగ్గినా, కరోనా వైరస్ మాత్రం ఉపశమించిన దాఖలాలు లేవు. ఉత్తర, దక్షిణ అమెరికాలు యూరప్, ఆసియా దేశాలలో ఆర్థిక సంక్షోభ ఒత్తిడికి, ఆకలి చావుల ప్రమాద ఘంటికలకు తట్టుకోలేని ప్రభుత్వాలు అన్‌లాక్ డౌన్ ప్రక్రియను చేపట్టాయి. దాంతో ఈ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య రెండూ పెరిగిపోతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు సైతం కోవిడ్-19ను కట్టడి చేయలేకపోతున్నాయి. అత్యాధునిక వైద్య సదుపాయాలకు, చికిత్సకు గ్లోబల్ చిరునామాలుగా ఉన్న అమెరికా వంటి దేశాల్లో కరోనా మరణవిలయం భయోత్సాతాన్ని సృష్టిస్తోంది. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఏకైక శత్రువు కోవిడ్ 19కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఉమ్మడి గాను, విడివిడిగాను జీవన్మరణ పోరాటాన్ని సాగిస్తోంది. సామాజికంగా భౌతిక దూరం, మానసిక దగ్గరతనం, దృఢత్వం తప్ప ఇతరత్రా కచ్చితమైన మందుల్లేని స్థితిలోకి మానవాళిని నెట్టివేసిన స్థితి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. భారీ మందుల కంపెనీలకు లాభాలను చేకూర్చే అల్లోపతి వైద్యాన్ని తప్ప -హోమియో, ఆయుర్వేదం తదితర ప్రత్యామ్నాయ వైద్య విధానాలను గుర్తించని వైఖరిని ప్రపంచవ్యాప్తంగా పాలకులు అనుసరిస్తున్నారు.
మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్గంలోనే, వలస కార్మికుల దురవస్థను పరిగణనలోకి తీసుకొని, అందుకు తగిన ఏర్పాట్లు చేయకుండా కఠినమైన లాక్‌డౌన్ చర్యలు చేపట్టినా, ఈ వైరస్ చాప కింద నీరులా విస్తరించింది. కోవిడ్ 19 మహమ్మారి మృత్యువిలయం కారణంగా కొనసాగుతున్న గ్లోబల్ లాక్‌డౌన్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఇప్పటికే 2007 అమెరికాలో మొదలైన సబ్ ప్రైమ్ క్రైసిస్ (గృహ రుణాల సంక్షోభం) 2008 నాటికే ప్రపంచ ఆర్థిక సంక్షోభంగా మారింది. దానికి సమాంతరంగా పెరిగిన భూతాపం కారణంగా ఏర్పడిన వాతావరణ మార్పు ముప్పు నేడు ఆకస్మిక మార్పుదశకు చేరుకుంది. ఆర్థిక, పర్యావరణ విధ్వంసాలతో కూడుకున్న ఈ జమిలి సంక్షోభాన్ని యుగ సంక్షోభం అని పిలుస్తారు. ప్రపంచానికి పెనుముప్పుగా మారిన యుగ సంక్షోభ సమస్య ఇప్పటికీ ఒక కొలిక్కి రాక ముందే కరోనా విశ్వమారి అంతర్జాతీయ సమాజాన్ని పీకల్లోతు మానవతా సంక్షోభంలోకి నెట్టి వేసింది. మొదటి, రెండవ ప్రపంచ యుద్దాలు కూడా ఈ స్థాయిలో అంతర్జాతీయ సమాజంపై ప్రతికూల ప్రభావం చూపలేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా క్యూబా, ఇటలీ, దక్షిణ కొరియా, న్యూజిలాండ్ తదితర దేశాలు కోవిడ్ ఉధృతిని అరికట్టి నెమ్మదిగా లాక్ డౌన్ స్ఫూర్తిని కొనసాగిస్తూ సాధారణ స్థితిని నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే సమయంలో కరోనా మరణాల రేటు ప్రపంచ సగటు 5.4శాతం కంటే తక్కువగా, మన దేశం లో అది 3.4 శాతమై నప్పటికీ గతంలో కంటే మరణాల సంఖ్య పెరిగి ఆందోళనకర పరిస్థితే నెలకొాని ఉంది. అన్‌లాక్ డౌన్ విధానాన్ని ప్రారంభించిన మే నెల 27వ తేదీ నుంచి ప్రపంచవ్వాప్తంగా లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
అత్యధిక కరోనా కేసులు నమోదైన ప్రపంచ దేశాల జాబితాలో ఫ్రాన్స్‌ను దాటి భారత్ 4వ స్థానానికి చేరుకుంది. ఒక్కసారిగా కరోనా కేసులు రావడం కమ్యూనిటీ వ్యాప్తికి సంకేతమని కొందరు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కరోనా పరీళ్లల్ని సక్రమంగా, తగినన్ని నిర్వహించడం లేవని, వాటిని సరిగా వర్గీకరించకుండా కోవిడ్ 19 ప్రభావాన్ని తక్కువ చేసి చూపుతున్నట్లుగా వెలువడుతున్న అనేక కథనాలు పలు సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి సందిగ్ధ సందర్భంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 'అన్ లాక్ డౌన్” ప్రక్రియను చేపట్టడంలో ఆంతర్యమేమిటి?
జూన్ 1వ తేది నుంచి 'అన్‌లాక్‌డౌన్ ప్రక్రియలో మొదటి దశను ప్రారంభించడం వెనుక ప్రజా ప్రయోజనాలు ఏ మేరకు ఉన్నాయి? లాక్ డౌన్ వల్ల పనుల్లేక సామాన్వుని జీవితం దుర్భరంగా మారింది. అందుకు ప్రభుత్వం నుంచి ఎంతో కొంత నిత్యావసరాల రూపంలో సహాయం లభిస్తున్నా ప్రజా జీవితంలో చీకట్లు అలుముకున్నాయి. ఉపాధి కరువై వలస బాట పట్టిన కోట్ల మంది ప్రజలు లాక్‌డౌన్ కారణంగా, అటు ఇంటికి వెళ్లలేక, వలసకు వచ్చిన ప్రాంతాల్లో ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారు. అన్ లాక్‌డౌన్ కారణంగా ఉపాధి దొరుకుతుండడం వల్ల అలాంటి వారికి కాంత ఊరట కలిగినా, ప్రాణాంతక విశ్వమారి కరోనా సంక్రమణ వల్ల ఉపాధి మాట దేవుడెరుగు ప్రాణాలకే ముప్పు వచ్చే ప్రమాద ముంది. కరోనా రెండవ విడత విబ్బంభిస్తే హృదయవిదారక మృత్యు విలయాన్ని చూడవలసి వస్తుందనే విషయం పాలకులకు తెలియంది కాదు.
కరోనా వ్యాధి కాదు విధానం:
చైనాలోని హుబై రాష్ట్రంలోని వూహాన్ నగరం కేంద్రంగా ప్రారంభమైన కరోనా - వైరస్ కలకలం నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రబలింది. స్వైన్‌ఫ్లూ, బర్డ్ ఫ్లూ, జికా తదితర రకరకాల రూపాల్లో