పుట:Ammanudi April-July 2020.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పట్టివేతకు సంబంధించి వార్తాకథనాల ప్రచురణను మొదలుపెట్టారు. పేలుడు పదార్థాలను పట్టుకున్న పోలీసు అధికారిని సంబంధిత వ్యక్తి తనకున్న రాజకీయ పలుకుబడితో బదిలీ చేయించారు. ఈ వార్తా తథనాలను మధ్యలోనే నిలివివేయాలనీ మాగుంట పట్టుబట్టారు. తాను సంపాదకుడుగా ఉంచగా అది సాధ్యపడదని ప్రకటించి, రాజీనామా చేసి పత్రికనుంచి తప్పుకున్నారు పొత్తూరి. ఆఫీసుకారులో ఇంటికి వెళ్ళటానికి కూదా మనస్మరించక, ఆటోను పిలిపించారు. అప్పుడు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎస్‌. వీరనారాయణరెడ్డి కల్పించుకుని, ఆయనకు నచ్చచెప్పి తనకారులో పంపించారు. మావోయిష్టులతో చర్చలు

వై.యస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 అక్టోబర్‌ 15వ తేదీన మావోయిష్టు నేతలకు, ప్రభుత్వ ప్రతినిధులకు చర్చలు జరిగాయి. అసాధ్యమనుకున్న ఈ చర్చలను సాకారం చేసిన పౌరస్పందన వేదిక బృంద సభ్యుడిగా పొత్తూరి క్రియాశీలపాత్ర నిర్వర్తించారు. చర్చలకుముందు మావోయిస్టులతో మంతనాల కోసం మూడుసార్లు అడవులకు వెళ్ళి వచ్చారు. అప్పటికే ఆయన, గుండె బైపాస్‌ సర్దరీ చేయించుకుని ఉన్నారు. అయినా ప్రయాస అనీ తటవటాయించకుండా పౌరస్పందన సభ్యులతో అడవులకు వెళ్ళి చర్చలకు ఒప్పించారు. ఆతర్వాత హైదరాబాద్‌లో చర్చలు జరిగినా అవి ఏ ఫలితాలూ ఇవ్వలేదు. ప్రెస్‌ అకాడమీ వైర్మన్‌గా భాషాసేవ చంద్రబాబు హయాంలో 1999 ఫిబ్రవరి 11న ఆంధ్రప్రదేశ్‌ ప్రైస్‌ అకాడమీ అధ్యక్షులుగా పొత్తూరి నియమితులయ్యారు. జర్న లిష్పులకు శిక్షణ కార్యక్రమాలతో పాటు, భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్ర సాపొత్య పరిషత్‌ పత్రిక, మీజాన్‌ వంటిఅలనాటి అపురూప పత్రికలనుసేకరంచి భావితరాలకోసం దిజిఖ్రైజేషన్‌ చేసి భద్రపరిచారు. డైస్‌ అకాడమీ వెబ్‌సైట్‌లో కొన్ని లక్షల పేజీలుఉన్న పాత పత్రికలను చూడవచ్చు. ఇది పొత్తూరి వారి కృషికి దర్చణం.

కలకత్తావాలా అనే వ్యాపారి ఉర్పూ, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో హైదరాబాద్‌ నుంచి మీజాన్‌ అనే పత్రిక నడిపేవారు. తెలుగు మీజాన్‌కు అడివి బాపిరాజు ఎడిటర్‌. స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీలో గాలించగా చినీగిపోయిన మీజాన్‌ వత్రీక మొదటిపేజీ పైభాగం దొరికింది. ఇది పత్రిక అవశేషమే అయినా చిన్నముక్కలో ముఖ్యమైన వార్తావిశేషం ప్రచురితమై ఉంది. హైదరాబాద్‌ సంస్థానాన్ని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేశంగా నిజామ్‌ ప్రకటించటం ఇందులో పతాక శీర్షికగా ప్రచురించారు.

తెలుగు పత్రికాభాషను ప్రమాణీకరించటానికి, నూతన పదకల్పనకు కూదా పొత్తూరివారు నిర్మాణాత్మక కృషిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ పట్టణాలలో భాషా సదస్సులను నిర్వహించారు. జూబిలీహలే ఏర్పాటుచేనిన విసృత సమావేశంలో పొత్తూరి ఆహ్వానంపై పి.వి.నరసింహారావు పాల్గునీ ప్రసంగించారు. తెలుగులో తీర్చు రాశారు

వినియోగదారుల రక్షణ చట్టంకింద ర్యాష్టకమీషన్‌లో సభ్యుడిగా పనిచేసిన కాలంలో జస్టిస్‌ లక్ష్మణరావు సహకారంతో తెలుగులోనే తీర్పులు రాసి చదివారు.


| తెలుగుజాతి పథ్రిక జువ్మునుడి ఆ ఇజలై-2020 |


అత్మకథ ముందు మాతో చదివించారు

ఫొత్తూరి వారు తన జీవిత విశేషాలను 'విధి నా సారధి” పేరుతో (గ్రంథస్థంచేశారు. రచన పూర్తికాగానే రామచం[ద్రమూర్తినీ, కల్లూరి భాస్మరాన్నీ నన్ను చదవమని చెప్పి, ప్రచురించవచ్చో లేదో నిగ్గతేల్బమన్నారు.

మొహమాటం లేకుందా సూచనలు చేయాలని, ఎక్కడైనా వాక్యాలు సరిగా లేకున్నా సందేహించకుండా తన దృష్టికి తేవాలని పొత్తూరి సూచించారు.

ఆయన పుస్తక ప్రచురణ యజ్ఞంలో చివరంటా నేను తోడుగా నీలిచాను. అది నాకు ఆనందం కలిగించే విషయం. ఆంధ్రపత్రిక వారపత్రిక సంపాదకీయాలను వ్యాసప్రభ చింతన, చిరస్మరణీయులు అనే మూడు పుస్తకాలుగా నేను ప్రచురించాను. రేడియో ప్రసంగాలను “నాటి పత్రికల మేటివిలువలు”గా వెలువరించాను.

పలు (గ్రంధాలను శోధించి తీవ పరిశవమతో ఆంధ్రజాతి అక్షరసంపద తెలుగు పత్రికలు పుస్తకాన్నీ రాశారు. 643పేజీల ఈ గ్రంధంలో తెలుగు పత్రికల గురించిన సాధకారిక సమాచారం ఉంది. చరిత్రలో నిలిచి వెలిగే పుస్తకమిది. డ్రైస్‌ అకాడమీ ప్రచురించిన ఈ పుస్తకం ప్రచురణ బాధ్యతలను వస్త స్వయంగా చూశాను. చిన్న సందేహం వచ్చినా, భద్రిరాజు కృష్ణమూర్తి వంటి పెద్దలను అడిగి నివృత్తి చేసుకోవడం నాకు ఆశ్యర్యాన్ని కలిగించింది.

పాదవనర్ణికపదకోశం, విధినాసారధి, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పుస్తకాలను ఎమెస్కో ప్రచురించింది. కుర్తాళం పీఠాధిపతి శ్రీసిద్దే శ్వరానంద భారతిస్వామివారు పూర్వాశమంలో