పుట:Ammanudi April-July 2020.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డాక్టర్‌ గోవిందరాజు చక్రధర్‌ 0849870250

అక్షరాల వెలుగులో అలుపెరుగని బాటసారి పొత్తూరి

జాతి హితమూ, సౌభాగ్యము కోరి అక్షరాలనే అస్రాలుగా మలుచుకుని తెలుగునాట ఎందరో మహనీయులు పత్రికా రచన యజ్ఞాన్ని పరమ పవిత్ర కర్తవ్యంగా నిర్వహించారు. వైతాళికులై నిలిచారు. అనాటి పత్రికలన్నీ సంపాదకుల మూర్తిమత్వంతో విలసిల్లాయి. ఆ సుసంపన్న వారసత్వాన్ని *కండువా'”గా దాల్చి సమాజ హితానికి, సమున్నత విలువలకు కడదాకా పాటుపడ్డారు డాక్టర్‌ పొత్తూరి వెంకటేశ్వరరావు.

త రాద్ధాంతాల చట్రంలో చిక్కుకోకుండా మానవత్వమే తన మతమంటూ అందరినీ కలుపుకుని వెళ్ళారు. జర్హలిజానికే పరిమితం కాకుండా సామాజిక విషయాల్లోనూ క్రియాశీల పాత్ర పోషించారు. ఈ క్రమంలో అన్ని వర్గాలవారి విశ్వాసాన్ని గౌరవాన్ని పొందారు. తన రచనల ద్వారా తెలుగు అక్షరానికి కొత్త వన్నెలు అద్దారు. 2020 మార్చి 5వ తేదీన 86వ ఏట పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఒక నిర్విరామ పథికుడు సెలవంటూ వెళ్ళిపోయాడు.

జీవిత విశేషాలు

పొత్తూరి వెంకటేశ్వరరావు 1934 ఫిబ్రవరి 8వ తేదీన గుంటూరు నమీవంలోని పొత్తూరులో వెంకట నుబ్బయ్య, పన్నిగేంద్రమ్మ దంపతులకు జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో బిఎన్సీ చేరినా, పూర్తి చేయలేకపోయారు. కాంగ్రెన్‌ నాయకుడు, బంధువు అయిన వి.బి.రాజు ప్రోత్సాహంతో 1957లో హైదరాబాద్‌కు మకాం మార్చి ఆంధ్రజనత పత్రికలో జర్నలిజం 'పస్టానానికి శ్రీకారం చుట్టారు. ఆ తదుపరి ఆంధ్రభూమి, ఈనాడు, ఆంధ్రప్రభ ఉదయం పత్రికల వరకు అయిదు దశాబ్దాలపాటు 'సేవలు అందించారు. శ్రీమతి సత్యవాణినివివిహం చేసుకున్నారు. పొత్తూరి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారు ప్రేమ గోపాలకృష్ణ అనసూయ వాత్సల్య, రహి ప్రకాశ్‌ పద్మజ జిల్లెళ్ళమూడి. అమ్మచూపిన ఆధ్యాత్మిక మార్గంలో నడిచిన ఆయన, పిల్లలకు పేరుపెట్టే విషయంలో కూడా అమ్మపట్ల భక్తిని చాటుకున్నారు. పొత్తూరులో ప్రణవాశ్రమాన్ని నెలకొల్పి, ఆధ్యాత్మిక జీవితానికి కేంద్రబిందువు చేసుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ దాక్టరేట్‌ను పొందారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉత్తమ జర్నలిస్టు పురస్కారాన్ని అందుకున్నారు. లెక్కకు మిక్కిలిగా సత్కారాలు, సన్మానాలు పొందారు.

ఆంధ్రశబ్దం పట్ల అభ్యంతరమా?

మొదటిసారి 1955లో హైదరాబాద్‌ వచ్చినప్పుడు విశాలాంధ్రవాసిగా ఉన్న పొత్తూరి, 1969 నుంచి తెలంగాణవాదిగా కొనసాగారు. తెలంగాణ ఉద్యమనాయకులను చర్చలకు పిలవాలని కోరుతూ నాటి ప్రధాని ఇందిరాగాంధీకి, జర్నలిస్టుగా లేఖలు రాశారు.

“నేను కోస్తా జిల్లాలనుంచి వచ్చిన ఒక సామాన్య పౌరడుగా కోరుకొన్నది తెలుగు వాళ్ళ మధ్య ఐక్యతను. అందుకు విరుద్ధ పరిస్థితి ఏర్పడినప్పుడు సమైక్యరాష్ర్రం వల్ల ప్రయోజనం లేదు. విడిపోయి, ప్రజలు స్నేహ సహృద్భావాలతో జీవించటం మేలు అనేది నా ఆలోచన” అని పొత్తూరి తన ఆత్మకథ 'విధి నా సారధి'లో రాసుకున్నారు.

అయితే ఇదే సమయంలో తెలంగాణా ప్రాంతంలో ఆంధ్ర శబ్దం వట్ల వ్యతిరేకత ప్రబలటం ఆయనకు బాధ కలిగించింది. తెలంగాణ ప్రాంతంలోని తెలుగువారు తాము ఆంధ్రులమన్న నత్యాన్ని మరవటం తీవ్ర మనస్తాపం కలిగించింది ఆయనకు ఆంధ్రులను తిట్టినప్పుడు అది తమను తాము తిట్టుకోవడమని తెలంగాణా ఆంధ్రులకు ఎలా చెప్పటం? ఎవరు చెప్పటం? అని పొత్తూరి ప్రశ్నించారు. పోతనగారి తెలుగు భాగవతం (ప్రాంతీయతకు అతీతంగా తెలుగునోట సర్వత్రా వూజలందుకొన్నది. అది ఆంధ్రమహా భాగవతమన్నది పోతనగారి మాట. కాకతీయుల సామ్రాజ్యం ఆంధ్ర సామ్రాజ్యమన్న మాటను మరిచారు. హైదరాబాద్‌లో ఆంధ్రజనసంఘం, ఆం(ధ్రభాషాభినిలయం ఏ పరిస్థితులలో ఏర్పడ్డాయో కొత్తతరాలకు తెలియకపోవడం దురదృష్టం అని పొత్తూరి విచారం వెలిబుచ్చేవారు. రవ్వంత రాజీ పడలేదు

కాంగ్రెస్‌పార్టీకి చెందిన మాగుంట సుబ్బారామిరెడ్ది యాజమాన్యంలోనికి వచ్చిన ఉదయం పత్రికలో ఏడాదిపాటు పొత్తూరివారు పనిచేశారు. ఆ సమయంలో కరీంనగర్‌లో పేలుడు పదార్థాల