రచన కమిటీ చైర్మన్‌గా అంబేద్మర్ నియమితులైనప్పటి నుంచి ఆయన ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల రాజ్యాంగాలను సునిశితంగా అధ్యయనం చేశారు. వాటి అవగాహన నేపథ్యంలో దేశంలోని అన్ని వర్గాలు కులాలు, ప్రాంతాలు, మతాలు, జాతులు, జెండర్ తదితర సామాజిక సమూహాలన్నిటి సమస్యల్ని వారి హక్కులు, ఆకాంక్షలు, అవసరాలన్నిటినీ ఆయన ఆకళింపు చేసుకున్నారు. ఈ క్రమంలో అంబేద్మర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని దేశప్రజలకు అందించడమే కాదు, 'రాజ్యాంగ రచన ' అంబేద్మర్ దృక్పథాన్ని తీర్చిదిద్దింది. పాశ్చాత్య ప్రజాస్వామిక దార్భనికుల దృక్పథం పునాదిగా రూపుదిద్దుకున్న అంబేద్మర్ అవగాహనను, రాజ్యాంగ రచన భారతీయ మార్గం పట్టించింది. వివిధ తరంగ పరిమాణాలుగా (వేవ్ లెంగ్త్), ఏడు రంగులతో కూడిన తెల్లటి కాంతిలాగా వివిధ కులాల ఏక వ్యవస్థగా ఉన్న భారత ప్రజాసమూహాల విడివిడి సమస్యలను, వారి హక్కులు, ఆకాంక్షలను ప్రతిబింబించింది. ఆ నేపథ్యంలో నడిచే రాజ్యం ద్వారా ప్రజలందరినీ చట్టం దృష్టిలో సమానంగాను, అణగారిన వర్గాలకు అండదండలను ఇచ్చే పాలనను ఎలా అందించాలనే కోణంలో సాగిన రాజ్యాంగ రచనా కృషితో అంబేద్మర్ ఆలోచనాక్రమం మరింత విస్త్రృతంగా సంఘటిత మైంది. దీంతో తొలి అంబేద్మర్ ఆలోచనల స్థానంలో రాజ్యాంగ రచన అనంతరం ఆయన ఆలోచనల్లో గుణాత్మక పరిణామం సంభవించింది. మొత్తం భారతీయ సమాజం పడుతున్న బాధ నుంచి విశ్వమానవ విముక్తి దిశగా ఆయన అలోచనలు ప్రవహించాయి. దాంతో మలి అంబేద్మరిజం దళిత, బహుజన, శ్రామిక లింగ తదితర అణగారిన ప్రజల దృక్పథం పునాదిగా మొత్తం భారతీయ సమాజ విముక్తి మార్గాన్ని సూచిస్తుంది. అందుకు అధ్యాత్మిక విప్లవం తప్పక జరగాలని ఆయన ప్రగాఢంగా ఆశించారు. సామాజిక వైయక్తిక బాధల నుంచి మానవ విముక్తి మార్గం ఆయనకు బౌద్ధంలో దర్శనమిచ్చింది.
అంబేద్మర్ సుదీర్ణకాలంగా బౌద్దాన్ని అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో; రాజ్యాంగ రచన ప్రభావంతో ఆయన అణగారిన అస్తిత్వాల దృక్పథం పునాదిగా మానవ విముక్తి మార్గం వైపు అడుగులు వేశారు. అందులో భాగంగా 1950లలో ఆయన బౌద్ధాన్ని లోతుగా, సునిశితంగా అధ్యయనం చేయడంపై కేంద్రీకరించారు. 1950లో సిలోన్ లో 'వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ బుద్దిస్ట్స్” అనే సమావేశంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. ఆ తర్వాత పూణెలో బుద్ద విహారాన్ని నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే బుద్దిజంపై పుస్తకం రాస్తున్నానని ప్రకటించారు. 1954లో బౌద్ద సాంస్కృతిక అధ్యయనం కోసం ఆయన బర్మాను రెండుసార్లు పర్యటించారు. రెండవసారి మళ్ళీ 'వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ బుద్దిస్టు' సమావేశంలో పాల్గొన్నారు. 1955లో ఆయన భారతీయ బుద్ధ మహాసభను స్థాపించారు. 1956 అక్టోబర్ 14న 22 ప్రమాణాలతో ధర్మచక్ర పరివర్తన సమావేశం విజయవంతమైంది. ఆ తర్వాత ఆయన ఖాట్మండూలో జరిగిన నాల్గవ ప్రపంచ బౌద్దీయ మహాసభలో పాల్గొన్నారు. 'బుద్దుడు, ఆయన ధర్మం 'అనే పుస్తకం చిత్తు ప్రతిని పూర్తి చేసిన అనంతరం మూడు రోజులకు 1956 డిసెంబర్ 6న ఆయన పరినిర్వాణం పొందారు.
రాజ్యాంగ రచనా ప్రక్రియ అంబేద్మరను సర్వమానవ విముక్తి దృక్పథాన్ని అలవర్చుకునేట్లు చేసింది. ఈ దృక్పథమే అంబేద్మర్‌ను మానవ విముక్తికి హేతు మార్గాన్ని సూచించే బౌద్దం వైపు మళ్లేట్లు చేసింది. 'ధర్మచత్ర ప్రవర్తన దినం ' సమావేశంలోని 22 ప్రమాణాల్లో ఏ ఒక్క ప్రమాణం కూడా కుల అణిచివేత పునాదిగా శుద్ద అగ్రకుల వ్యతిరేకతను, ధిక్మారాన్ని సూచెంచేదిగా లేకపోవడం విశేషం. శుద్ద కుల దృక్పథం నుంచి కాకుండా అణగారిన కులాలు, వర్గాల దృక్పథం పునాదిపై మొత్తం సామాజిక విముక్తి అవగాహానను ఆయన సంతరించుకున్నట్లు అర్ధమవుతుంది. హిందూ మత ఆధ్యాత్మికత నుంచి భారతీయ సమాజం బయటపడి బౌద్ధ దృక్పథాన్ని సంతరించుకోవలసిన అవసరాన్ని ఆ ప్రమాణాలు నొక్కి చెబుతున్నాయి. వర్గ పోరాటం, సామాజిక సమానత్వం అనే భావనలతో కూడిన నవయాన బౌద్ద దృక్పథమే విముక్తి మార్గంగా అంబేద్మర్ బోధించారు. అన్ని రకాల అసమానతలను ధ్రువీకరించే హిందూ మత దృక్పథానికి ప్రత్యామ్నాయంగా అత్మ పునర్జన్మ, నిరాశావాద ఆర్యసత్వాలు తదితర అహేతుక భావనలు లేని అసలైన బుద్ద బొధనలను అధ్యయనం చేయాలని అంబేద్మర్ సూచించారు. సమగ్ర సామాజిక దృక్పథాన్ని మలి అంబేద్మరిజం సూచిస్తుంది. నేడు అంబేద్మర్ వాదులుగా చలామణి అవుతున్నవారు స్వాతంత్య్రొద్యమ కాలంనాటి తొలి అంబేద్మర్ దృక్పథానికే పరిమితమై, రాజ్యాంగరచన తర్వాత ఏంతో పరిణతి చెందిన మలి అంబేద్మర్ హేతుదృక్పథాన్ని నిర్ణక్ష్యం చేస్తున్నారు. శకల మతవాదమైన కులవాదాన్ని పట్టుకుని తమలోతాము పోట్లాడుకోవడం వల్ల ఆయా సామాజిక సమూహాలకే కాక, మొత్తం సమాజానికి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఆయా కుల అస్తిత్వాల నుంచి రిజర్వేషన్లు, ప్రభుత్వ సహాయాలతో ఆర్థికంగా లబ్ది పొంది, సంప్రదాయ వృత్తుల నుంచి బయటపడి వివిధ ఉపాధి వ్యవహారాల్లో స్థిరపడిన అవశేష అస్తిత్వ (కుల, మత, ప్రాంత, జాతి, లింగ తదితర) ప్రజానీకం నుంచి వచ్చిన నాయకులు ముఖ్యంగా ఇలాంటి సంకుచిత అస్తిత్వ వాదాలను ముందుకు తెస్తున్నారు. వాళ్ళు బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలన్న అంబేద్కర్ పిలుపును తల్లకిందులుగా మార్చి, పాలక వర్గాల అధికార యంత్రాంగంలో భాగస్వాములుగా, ఆయా పార్టీలకు తమ అస్తిత్వ ప్రజానీకపు వోటు బ్యాంకుల్ని సమకూర్చే “దండ నాయకులు”గా తయారయ్యారు. అణగారిన అస్తిత్వ ఉద్యమాలు అత్యంత సమర్దనీయమైనవి, అనివార్యమైనవీను. ఆపేరుతో పాలకవర్గ కూటమిలో స్థానం కోసం పాకులాడే అస్తిత్వవాద నాయకులు తమ నిజ అస్త్రిత్వాల (సంప్రదాయక వృత్తుల్లోని శ్రామిక ప్రజలు) ప్రజానీకానికి తీవ్ర ద్రోహం చేస్తున్నారు
బహుజన హితాయ!
అంబేద్మర్ ప్రధానంగా పాశ్చాత్య హేతువాద తాత్త్విక పునాదిగా సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేసారు, అవపోసన పట్టారు. దాంతో ఆయన వివిధ మతాలకు చెందిన దృక్పథాలను సైతం సామాజిక ప్రజాస్వామిక స్వభావాnni కలిగి ఉన్నాయా లేదా అనే కోణం నుంచి మాత్రమే పరిశోధించారు. ఈ నేపథ్యంలో ఆయన బౌద్దాన్ని కూడా సామాజిక దృక్పథంతోనే అధ్యయనం చేసారు కానీ, దానిలోని అమేయమైన తాత్వికతను ఆకళింపు చేసుకోలేదు. “బుద్దుడు,
తరువాయి 40వ పుటలో...
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి జూలై-2020
26