పుట:Ammanudi April-July 2020.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తుంది. ఈ అభ్యాసాల సాయంతో భాష నేర్చుకోలేరు.

పిల్లలు పుస్తక పఠనంతోనే భాష నేర్చుకుంటారు. చదవడం ఇదొక్కటే మార్గం. ఏపుస్తకాలు చదవాలి. కథల పుస్తకాలు చదవాలి. వారికిష్టమైన ఏ ఇతర పుస్తకాలైనా చదవాలి. చదవంగా చదవంగా పుస్తకాలలో ఉందే మంచి విషయాలు క్రమక్రమంగా పట్టుబదతాయి. వాక్య విన్యాసాలు గమనిస్తారు. అలవోకగా రాయడం కూడా నేర్చుకుంటారు.

పిల్లలకి ఏపనీ చేయడం ద్వారా భాష వస్తుందో ఆ ఒక్కపని వాతం చేయనీయకుండా భాష నేర్ప్చించాలనుకోవడం ఎంత అవివేకం! ఎంత మూర్ధత్వం!! కథలు చదివేపిల్లల్బికూదా చదవకూడ దనీ దండిస్తారు. స్కూలులో లైబ్రరి ఉంటుంది. ఒక్క పుస్తకం బయటకు తీయరు. భాషపైన పట్టు, భాషపైన మక్కువ, ఎలా కలుగుతుంది.

ఇత పద్వాల సంగతి చూద్దాం. తెలుగుభాషకు పద్యం ఒక వరం. విల్లల వయసునుబట్టి స్థాయినిబట్టీ పద్వాలు పరిచయం చేయాలి. ఆ పద్యాలలో కనీసం సగం వదాలైనా పరిచయమైనవి, విడదీస్తే అర్జమయేవి ఉందాలి. ఒక్కపవంకూడా అర్ధంకాని పద్యాలకు తెలుగు పద్యాలనీ పేరుపెట్టి వాటినీ పిల్లలకు నేర్పించాలనుకోవడం న్యాయం కాదు. సులభమైనవి తేలిగ్గా ఉండే తెలుగుపద్వాలు ఎన్ని లేవు? కాలాన్ని కులాలను (ప్రాంతాలనుబట్టి కవులందరినీ పరిచయం చెయ్యాలనే నీయమం పెట్టుకుని పిల్లల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు. ఈ పనులవలన అసలుకే మోసం వస్తుందని తెలుసుకోవాలి. తెలుగు కష్టమని తెలుగు పద్యాలు కష్టమని పిల్లలు ఎందుకు అనుకోవాలి. కఠినమైన పద్యాలు పాఠ్యపుస్తకాలలో పెట్టడంతో పాటు ఆ పద్యాల ప్రతిపదార్థం నేర్చుకోమనడం ఏమిటి? భావం తెలిస్తే చాలదా? పద్యాల గురించి ఇంతగా చెప్పడానికి కారణం ఉంది. సగం పాఠాలు పద్యభాగంలో ఉంటాయి కనుక!

ఈ పాఠాల సంగతి పళ్మన పెడదాం. ఈ కాలానికి ఉపయోగపడే విషయాలేమైనా నేర్చిస్తున్నామూ అంటే అదీ లేదు. పదవ తరగతి పూర్తిచేసిన విద్యార్ధి పాసయినా 'ఫేలయినా అప్పటి దాకా నేర్చుకున్న తెలుగు అవసరానికి ఉపయోగించుకోవాలికదా! ఒక అర్జీ రాయగలదా? దరఖాస్తు ఫారం పూర్తివేయగలదా? ఒక ఉత్తరం రాయగలదా? రసీదు రాయడం, కనీసం రైల్వే రిజర్వేషన్‌ ఫారం పూర్తిచేయడం తెలుసా? తన పోస్టల్‌ అడ్రసు చెప్పగలదా? బ్యాంకు ఎక్కౌంటు తెరిచి లావాదేవీలు జరపడం తెలుసా?

ఏదైనా ఒక విషయం గురించి వ్యాసం రాయడం తెలుసా? కంప్యూటర్‌లో తెలుగు టైపు(డి.టి.పి) చేయగలడా? తన బయోడేటా రాసి ఇవ్వగలదా? వార్తాపత్రికలు చదివే అలవాటు ఉందా? ఏదాదికి ఒక్క పుస్తకమైనా చదివే ఆసక్తి ఉందా? ఒక విషయాన్ని వార్తలా రాయగలడా? కనీసం స్పష్టంగా చదవగలడా?

ఇవేవీ నాకు రావు. సవర్దదీర్హ సంధి సూతం చెబుతా ఒక పద్యం చెబుతా అంటే కుదరదు. ఆభునీక జీవితావసరాలకంటే తగినట్లు తెలుగు పాఠాలు తెలుగు బోధనా పద్దతులు ఉండాలి.

పదవతరగతి స్థాయి పిల్లలు నేర్చుకోలేనంత కఠినమైన విషయాలు కావు. తెలుగు చదవడం రాయడం తెలిసిన పిల్లలు సులభంగా నేర్చుకోగలరు. ఎందుకంటే ఇవి వాళ్ళ జీవితావసరాలు.

అసలు రహస్యం ఏమిటంటే మన విల్లలు సొంతంగా నాలుగు వాక్యాలు కూడా రాయలేరు. సొంతంగా వాళ్లను రాయినిస్తే గదా! రాస్తే మార్కులు వేస్తారనీ విల్లలకు నమ్మకం లేదు. పుస్తకంలో ఉన్న దున్నట్ల రాస్తే చాలా గొప్ప. కంఠస్తం చేసి రాస్తే ఆ విద్యార్థి చాలా కష్టపడి నేర్చుకున్నట్లు టీచర్‌ భావం. మార్కులు బాగా వేస్తారు. పిల్లల సృజనాత్మకత మీద టీచర్లకు నమ్మకం లేదు.

తెలుగు చదవడం రాయడం రాకుండా ఇంతమంది పిల్లలు ఎలా పాసవు తున్నారు. పాసుకావడానికి సవాలక్ష మార్గాలు ఉన్నాయి. పాసు చేసిందాకా ప్రభుత్వం వదలదు గదా! ఆ మార్గాలు వెతికే పనిలో పిల్లలు, వారి తల్లిదండ్రులు, టీచర్లు, అధికారులు, పరీక్షాకేంద్రాలు, పరీక్ష పేపర్లు దిట్దే 'సెంటర్లూ తలమనకలై ఏడాదంతా కృషిచేస్తూ ఉంటారు. అందరికీ తెలిసి, ఎవరికీ తెలియనంత రహస్యంగా ఈ అద్భుతం జరిగిపోతుంది. మరి తెలుగు వస్తే ఎంత! రాకపోతే ఎంత!

తెలుగు పాఠ్యపుస్తకాలు మార్చడానికీ తెలుగు బోధనా పద్ద తులు మార్చదానికీ మళ్ళీ ఒక గిడుగు రావాలా? తెలుగు భాషను కాపాడు కోవడానికి మూడు మార్దాలున్నాయి. 1. తెలుగును పరిపాలనా ఖాషగా అమలుపరచడం. 2. తెలుగు పాఠాలు ఆధునీక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం, 3. తెలుగు చదవడం రాయడం నేర్పడానికి సులభమైన మార్గాలు రూపొందించడం.

వెఎదటిది వభఖుత్వం చేతిలో ఉంది. గత 70 సంవత్సరాలుగా ఇది అమలు చేయలేకపోయాం. రెండూమూడూ తెలుగు భాషాభిమానులు తెలుగు పరిశోధకులు” పండితులు చేయవలసిన పనులు. ఇవి మన చేతిలో పనులు. ఏది ముందు ఏది వెనుక అనే మీమాంస వదిలిపెట్టి తెలుగు పాఠాలు ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్చాలనే విషయంలో మనస్సు 'పెదదాం.


“ఎండమావి నీళ్ళు చూసి...

20 వ పుట తరువాయి ...

పునరావాస కేంద్రాలకు తరలిస్తాం. సూదిమొన భూమి ఇచ్చేదిలేదు. అంటూ దుర్యోధనుడు మీసాలు మెలేస్తూ నిష్కమిస్తున్నాడు. శస్తాస్తాలు సమకూర్చుకుని, బంధుమిత్రులను కలుపుకుని, “నీవు నాకు సలహా ఇస్తే చాలు అని అర్జునుడు మళ్ళీ రావటానికి ఇంకా చాలాకాలం పల్టేటట్టుంది. అప్పటిదాకా 'కర్మణ్యేవాధికారస్తే? అనే బోధతో ఆయనను ఓదార్చటమే ఇప్పటికి చేయగలిగినది. 'అళ పెంచుకోకు నేస్తం-అది నిరాశకు స్వాగతవాస్తం”

5

“శిశువు శారీరక వికాసానికి అమ్మపాలు - మానసిక వికాసానికి అమ్మనుడి”

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ జులై-2020 |