పుట:Ammanudi April-July 2020.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆసలు సంగతి

సి.వి. కృష్ణయ్య

98965155

తరగతి గదిలో తెలుగు

తెలుగుభాషకూ, తెలుగుజాతికీ, ఈనాడు ఇంతకష్టం ఎందుకు వచ్చింది. ఇంగ్రీషువస్తే చాలు తెలుగు రాకపోయినా పరవాలేదు అనేంతవరకూ ప్రభుత్వం రావడానికి కారణం ఎవరు? ప్రజలుకూడా ఇదే మాయలో ఎందుకు పడ్డారు. కొంతమంది మేధావులు ఇది అశాస్రీయమని తెలిసికూడా ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ఎందుకు సమర్ధిస్తున్నారు.

విద్య వ్యాపారస్తుల చేతుల్లోకి పోయిందని రాజకీయ నాయకులు ప్రజల అమాయకత్వాన్ని ఇంగ్లీషు పేరుతో తమ స్వార్ధానికి ఉపయోగించుకుంటున్నారని అనడంలో వాస్తం ఉన్న మాట నిజం. కాని ఇంకా అనేక కారణాలున్నాయనే సంగతి మనకు తెలుసు; చాలా మందికి అదే తరగతి గదిలో తెలుగుబోధను బోధనతోపాటు తెలుగు పాఠ్యపుస్తకాల సొబగు కూడా. నేను ఈ విషయానికి పరిమితమౌతాను. ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా తరగతి గదిలో నేను పొందిన అనుభవాలు, తెలుసుకున్న విషయాలు ఎంతో ఆవేదనతో తెలియ జేస్తున్నాను. ఈ విషయంపై తెలుగు భాషాభిమానులు దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాను.

తరగతిగదిలో మన పిల్లలు సులభంగా అనందంగా తెలుగు నేర్చుకొని ఉంటే తెలుగు భాషలో పాఠాలు అర్ధం చేసుకునిఉంటే, తెలుగుభాషతో వినోదించి ఉంటే, తెలుగు భాషపై ఉపాధ్యాయులు విల్లలకు అభ్గిరంచి కలిగించి ఉంటే, బట్టీ వట్టకుండా సొంతమాటల్లో రాయడం నేర్చుకొని ఉంటే, ఇంత లేలిగ్గా తెలుగుకు తెలుగు పాలకులు సమాధి కట్టడానికి పూనికొనిఉండేవారు కాదు. కన్నతల్లిని కడతేర్చదానికి కరకు కత్తులు దూసేవారు కాదు. తెలుగు ప్రజలు జరుగుతున్న ఈ విషయాన్ని చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయేవారు కాదు.

తరగతిగదిలో తెలుగు బోధనకు సంబంధించిని విషయంలోకి పోయేముందు ఇప్పుడు మనం తెలుగు ఎందుకు నేర్పుతున్నామో తెలుసుకోవడం అవసరం. (నేను తెలుగు అనే మాటకు మాతృభాష అనే భావంతో వాడుచున్నానని అర్ధం చేసుకోవాలి)

గతంలో తెలుగు భాష నేర్చుకోవలసిన అవసరానికి నేడు తెలుగుభాష నేర్చుకోవలసిన అవసరానికీ తేడా ఉంది. గతంలో తెలుగుభాష నేర్చుకోవడం అంటే తెలుగుభాషలో పాండిత్యం సంపాదించడంగా భావించేవారు. తెలుగుభాషా సాహిత్యాల పైన పట్టు సంపాదించడమే చదువు యొక్క పరమోద్దేశంగా ఉండేది.

కానీ నేటి అవసరం వేరు. ప్రపంచాన్ని పుస్తకాల ద్వారా అర్ధంచేసుకోవడానికి తెలుగుభాష నేర్చుకోవాలి. తెలుగుభాష ద్వారా విజ్ఞానశాస్త్ర గ్రంధాలను చదివి అర్ధం చేసుకోవాలి. పరభాషలను నేర్చుకోవాలి. సోషల్‌, సైన్సు, గణితంవంటి సబ్జెక్టులు, ఇంగ్లీషు, హిందీవంటి ఇతర భాషలను నేర్చుకోవాలి. గతంలో మాదిరి తెలుగు వ్యాకరణం, ఛందన్సు వంటి విషయాలు నేర్చుకోవలనిన అవసరంలేదు. దాన్నాక ప్రత్యేక విషయంగా నేర్చుకోవాలనుకునేవాళ్ళు నేర్చుకోవచ్చు. అదికూడా హైస్కూల్‌ చదువులు దాటిన తరువాతే జరగాలి.

ఇప్పుడు అసలువిషయానికొద్దాం. తరగతి గదిలో తెలుగు పేరుతో నేర్చిస్తున్నదేమిటో చూద్దాం.

ఒకటి, రెండు తరగతులుదాటగానే తెలుగుభాషా పాండిత్యాన్ని పిల్లల నెత్తిమీద కుమ్మరించదానికి పూనుకుంటాం. మూడవ తరగతి పిల్లలకు ఇదే చదువు సరిగా చదవడం రాదు. ఇప్పుడిప్పుడే ఈత నేర్చుకుంటున్న పిల్లల్లా తంటాలు పడుతుంటారు. అలాంటి పిల్లలకు ఏదో ఒకరకంగా వ్యాకరణం నేర్చించాలనుకుంటాం. పై తరగతులకు వెళ్ళేకొద్దీ పాఠం వెనుక వ్యాకరణాంశాలతో అభ్యాసాలను చేర్చి మార్చి తెలుగు పాఠ్యపుస్తకాలను బరువెక్కిస్తాం.

భాషాభాగాలు, లింగవచన విభక్తులు, వివిధరకాల సంధులు వాటి సూత్రాలు, సమాసాలు, పర్యాయపదాలు, నానార్థాలు, అర్ధాలు, పకృతి వికృతులు, ఛందస్సు, అలంకారాలు, వాక్యభేదాలు, కంఠస్థ పద్యాలు, ప్రతిపదార్థాలు, భావాలు ప్రశ్నలు జవాబులు-

పిల్లలు వీటిని అర్థంచేసుకోలేక ఎందుకు నేర్చుకోవాలో తెలియక ఎంత ఇబ్బంది వడుతున్నారో మనం పట్టించుకోం. ఎందుకంటే తెలుగుభాష నేర్చుకోవడమంటే ఇవన్నీ నేర్చుకోవడమని మనం ఎప్పటినుంచో ఒక అభిప్రాయాన్ని స్థిర పరచుకున్నాం, అలవాటు పడిపోయాం.

సంధి, వికల్పం, నిత్యం, యదాగమం, అత్వసంధి, యణాదేశ సంధి, సవర్దదీర్హసంధి, గుణసంధి, త్రికసంధి. కర్మధారయ సమాసం, ఉపమాలంకారం, ఇలాచెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇవన్నీ పిల్లలు గుర్తుపెట్టుకోలేక భయపడిపోతున్నారు. ఎలానో తంటాలుపడి కొద్దిమంది పిల్లలు నేర్చుకుంటారు. పరీక్షల వరకు గుర్తుంచుకొని ఆ తరువాత మరచిపోతారు.

ఇది తెలుగు పాఠ్యపుస్తకాలతోను, తెలుగుభాష నేర్పడానికి చేసే సర్మస్‌ విన్యాసాలతో ఆగదు. తెలుగులో ఉన్న సైన్సు గణిత పుస్తకాలలోని సాంకేతిక పదాల గొప్పతానాన్ని వర్ణించ నలవికాదు. ఎందరో మొత్తుకున్నారు. విమర్శించారు. వాడుకలో ఉన్న పాదాలను సూచించారు కూడా. మార్పు కనివించలేదు. సైన్సు గణిత సిద్ధాంతాలభాష సూత్రాలు, వాక్య విన్యాసాలు ఎంత కృత్రిమంగా ఉంటాయో చెప్పలేం. ఈ తెలుగు వృస్తకాలకంటే ఇంగ్లీషు సులభమన్నంతగా ఉంటాయి!

భాష ఎంత నరళంగా ఉంటే అంత శక్తిమంతంగా ఉంటుందనే మాట మనం పట్టించుకోం. పాయసం జుర్రుకున్నట్లు పరమాన్నం తిట్టున్నట్లు ఉండాలికదా! కషాయం తాగుతున్నట్లు ఉంటే ఎలా? మనకు ఎంత క్లిష్టంగా అంత గొప్ప. ఎవరికీ అర్ధంకాకపోతే ఇంకా గొప్ప. తెలుగు పాఠ్య పుస్తకంలో ఒక మంచి కథో, విషయమో, పద్యమో ఉంటుంది. వాటినే ఆనందంగా ఆస్వాదిస్తారు. ఆ ఆనందం కాస్తా అభ్యాసాలతో వ్యాకరణాంశాలతో మటుమాయం అయిపో | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి ఈ ఖలై-2020 |