పుట:Ammanudi-May-2019.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భాషోద్యమ కథానిక

ఆచార్య కొలకలూరి ఇనాక్‌ 94402 43433

'మీ పేరేమో ఇంగ్లీషు పేరు కావచ్చు. ఇంగ్లీషులో మాత్రం రాయరు. మేం ఇంగ్లీషులో రాస్తే తప్పు అంటారు. బాగుందండి మీ వరస!


నేను తిరుపతిలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడుగా ఉన్న ప్పుడు బంధువుల్ని పలకరించటానికి భీమ వరం వెళ్ళాను. ఎవరింటికీ వెళ్ళకుండా ఎక్క డయినా వసతి చూచుకోవాలను కొన్నాను. ఎక్కడ బాగుంటుందని అడిగితే “విజయ లక్షి” మేలు అన్నారు. వెళ్ళి, “గది కావాలి” అన్నాను.

“'ెంగిలా? డబలా?” అని అడిగాడు.

'నేనాక్కణ్ణే అన్నాను.

“అయితే సింగిల్‌ తీసుకొండి” సలహ ఇచ్చాడు.


“సరే అన్నాను.

“ఏసినా? నానేసినా?” అని అడిగాడు.

“అసలే చలికాలం” అన్నాను.

“అయితే నాన్‌ - ఏసీ సింగిల్‌ ఇస్తాను” అన్నాడు.

“సరే అన్నాను.

“ఎన్ని రోజులుంటారు?”

“రెండు రోజులు”

“చెకిన్‌ ఎప్పుడయినా, చెకవుట్‌ మిడ్డే ట్వెల్వో క్లాక్‌” అన్నాడు.

“సరే అన్నాను.

“టూ డేస్ కదా! త్రీ దవుజండ్‌ అడ్వాన్సు ఇవ్వాలి” అన్నాడు.

“అలాగ్గే' అన్నాను.

“రిజిష్టర్‌లో పేరు, ఊరు, అడ్రసు, ఫోను నెంబరు రాయండి” అన్నాడు.

“భోజనం ఇక్కడేనా? బయటా?” అడిగాను.

'హోటల్‌ ఎటాచ్‌ద్‌! వెజ్‌ ఆ? నాన్‌ వెజ్‌ ఆ?” సమాచారం చెప్పాడు. ప్రశ్నలు అడిగాడు.

“ఏదైనా ఫరవాలేదు” అన్నాను.

38

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019