పుట:Ammanudi-May-2019.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాన్సులను వీడడం గురించి విని తాను కూడా చిన్న శయ్య పైననే శయనించ సాగింది. మాలాగంధవిరహితుడ వైనట్టు వినీ తానూ వాటిని ధరించడం మాని వేసింది.” నీ సేవా సుశ్రూషలు చేస్తాం రా అని పుట్టింటి వారి వైపునుండీ ఎన్ని లేఖలు వచ్చినా వాటిని కన్నెత్తి చూడదు. భగవాన్‌! నా కూతురంత గుణవతి.” భగవానుడా తరువాత ధర్మదేశనం చేసి ఆసనంనుండీ లేచి నిష్క మించాడు.

మూడవరోజున, అంటే రాకుమారుడు నందుని అభిషేక, గృహాప్రవేశ, వివాహాలు మూడూ జరుగవలసిన శుభదినాన భగవానుడు భిక్షకు బయలుదేరాడు. శుభమని పలికి లేచివెళ్ళేటప్పుడు రాకుమారుడు నందుని చేతి నుండి భిక్షాపాత్రను తిరిగి తీసుకోలేదు. తథాగతుని పట్లనున్న గౌరవాదరాలవల్ల “భంతే !భిక్షాపాత్రను తిరిగి తీసుకొమ్మని అతడూ అనలేక పోయాడు. 'మెట్లు దిగి తీసుకుంటాడు: వాకిట తీసుకుంటాడు అనుకొంటూ అతడు వెనుకే వెళుతున్నాడు కానీ బుద్దుడు మాత్రం ఎక్కడా తిరిగి తీసుకోలేదు. అక్కడ ఉన్నవారు వెళ్ళి అతని భార్య అయిన జనపద కల్యాణ్‌ (సుందరి)తో “భగవానుడు నందరాకుమారున్ని వెంటతీను కొని పోతున్నాడు. ఆయన మీ ఆయనను నీక్కాకుండా చేసేస్తాడు” అని చెప్పారు. ఆమె తడిచిన కురులూ చేత దువ్వెనతో వడివడిగా పై అంతస్టుకు వెళ్ళి కిటికీని తెరిచింది. “ఆర్వపుత్రా! త్వరగా తిరిగి రావాలి " అని అరిచింది. ఈ పిలుపు నందుని గుండెలను కలచి వేసింది. బుద్దుడు అలాగే విహార ప్రవేశం చేసి “నందా! ప్రవ్రజితుడివవుతావా?” అని అడిగాడు. ఎదురు చెప్పలేక “ఆఁ అవుతాన”న్నాడు. “నందుని ప్రవ్రజితుని చేయండి” అని భగవానుడన్నాడు. ఇలా కపిలవస్తును చేరిన మూడవ రోజున ఆయన నందకుమారుని ప్రవ్రజితుడిని చేసాడు.

ఏడవ రోజున యశోధర కొడుకు రాహులుని అలంకరించి, “నాయనా! అ ఇరవై వేలమంది మధ్యన కూర్చుని బంగారు కాంతులను వెదజల్లుతున్న..ఆ శ్రమణుని చూడు. ఆయనే నీ తండ్రి. ఆయన వద్ద అనేక నిధులుండేవి. అవి ఆయనిల్లు వదిలిన నాటీనుండీ కనబడడంలేదు.” అని చెప్పి బుద్ధభగవానుని వద్దకు పంపింది.

భగవానుడు పూర్వాహ్న సమయాన, పాత్రచీవరాలను తీసుకుని శుద్దోదన శాక్యునింటికి వెళ్ళాడు. అపుడు యశోధర రాహు లునితో “రాహులా! ఆయనే నీ తండ్రి. వెళ్ళి ఆస్థిలో నీ భాగాన్నిమ్మను అని చెప్పి పంపింది. అపుడు రాహుల కుమారుడు భగవానుని ముందుకు వెళ్ళి ఆయన ముందు నిలబడ్జాడు. “శ్రమణా! నీ నీడ చాలా సుఖకరంగా ఉంది” అన్నాడు. భగవానుడప్పుడు ఆసనంనుండీ లేచి నడువసాగాడు. రాహులుడు ఆయన వెంటే నడుస్తూ “శమణా నా వారసత్వ భాగం నాకివ్వు” అనసాగాదు. భగవానుడు తలను తిప్పి, “శారిపుత్రా! అలాగైతే రాహులునికి ప్రవ్రజ్యనివ్వు” అని అన్నాడు.

“భంతే! రాహులకుమారుని కే విధంగా ప్రవ్రజ్యనివ్వాలి?” అని అడిగాడు శారిపుత్రుడు.

ఈ సందర్భంలోనే థర్మ దేశనాన్ని చేసిన భగవానుడిలా అన్నాడు- “ఖిక్షులారా! మొదట కేశాలను తీయించి కాషాయాన్ని కట్టబెట్టాలి. ఆ తరువాత ఉత్తరాసంగాన్ని ఒక భుజం పైకి సర్దించి


వీరాసనంలో కూర్చోబెట్టాలి. చేతులు జోడింప జేసి ఇలా అనమనాలి. “బుద్ధం వరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం సరణం గచ్చామి.”

దుతియంపి బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి.

తతియుంపి బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి.”

అపుడు ఆ శారివుత్రుడు రాహులకుమారుని ప్రవ్రజింవ జేశాడు. ఆ తరువాత శుద్దోదన శాక్యుడు భగవానుని సమీపించి, అభివాదం చేసి ఒక ప్రక్కన కూర్చుని- “భంతే! నేను భగవానుని నుండి ఒక వరాన్ని కోరుతున్నాను.” అన్నాడు.

"గౌతమా! తథాగతుడు వరాలకు అతీతుడు.” బుద్ధభగవాను డన్నాడు.

“భంతే! ఇది ఉచితమైంది. దోషరహితమైంది.” శుద్దోధనుడు చెప్పాడు.

“అదేమిటో చెప్పు గౌతమా.” అడిగాడు భగవానుడు.

“భంతే! భగవానుడు ప్రవ్రజికుడైనప్పుడు నాకెంతో దుఃఖం కలిగింది. అలాగే నందుడు ప్రవ్రజితుడైనప్పుడు కూడా దుఃఖం కలిగింది. ఇప్పుడు రాహులుని ప్రవ్రజ్యతో అది మిక్కుటమైపోయింది. భంతే! పుత్ర ప్రేమ చర్మాన్ని ఛేదిస్తుంది. చర్మాన్ని ఛేదించి నా మాంసాన్ని నాడులను, ఎముకలను ఛేదిస్తుంది. భంతే! ఆర్యులు (భిక్షువులు) తలిదండ్రుల అనుమతి లేని వారికి 'ప్రవ్రజ్యనీయకుంటే బాగుంటుంది.”

ఆ తరువాత ఖగవానుదు ఆయనకు ధర్మదేశన చేశాడు... అపుడాయన లేచి భగవానునికి అభివాదన ప్రదక్షిణలు చేసి నిష్రమించాడు. భగవాను డిదే సందర్భంలో ధర్మ దేశనం చేసి ఖిక్షువులతో ఇలా అన్నాడు

“భక్తులారా తలిదండ్రుల అనుమతి లేనీ వారికి భిక్షువులు ప్రవ్రజ్యనివ్వకూడదు. ఇచ్చిన వానిది దుష్కృత దోషం.”

మహామౌద్దల్యాయనుడు రాహులునికి తలగొరిగి కాషా యాన్ని కట్టి త్రిశరణగమనం చేయించాడు. మహాకాశ్యపుడు ఉపదేశమిచ్చే ఆచార్యుడయ్యాడు.

(మహాపండిత రాహుల్‌ సాంకృత్యాయన్‌ “శ్రీబుద్దచర్వా” లోని భాగానికి అనువాదం)

స్పందనను వ్రాయండి “అమ్మనుడిలో రచనలపై మీ స్పందనను వ్రాసి పంపండి!

సంపాదకుడు “అమ్మనుడి, జి-2, శ్రీ వాయుపుత్ర రెసిడెన్సీ, హిందీ కళాశాల వీధి, మాచవరం, విజయవాడ-520 004 ఇ-మెయిల్‌ : editorammanudi@gmail.com

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019

37