పుట:Ammanudi-May-2019.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బుద్దపూర్ణిమ మే 18.

ఈమని శివనాగిరెడ్డి -స్టపతి 98485 98446

కపిలవస్తు నగరానికి బుద్ధుని రాక

తథాగతుడు వేణువనంలో విహరిస్తున్న సమయంలో- కుమారుడు ఆరేళ్ళ కఠోరసాధన చేసి సమ్యక్‌ సంబోధిని పొందాడనీ, ధర్మచక్రాన్ని ప్రవర్తింపజేసి, నేడు వేణువనంలో విహరిస్తున్నాడనీ మవోరాజు శుద్దోదనునికి తెలిసింది. శుద్దోధనుడు మంత్రిని పిలిచి అతనితో, *నా ఆజ్ఞగా వేయిమందిని తీసుకొని రాజగృవానికి వెళ్ళి, నీ తండ్రి శుద్దొదనుడు నిన్ను చూడాలనుకొంటున్నాడని చెప్పి, నా కుమారుని తీసుకురా” అని చెప్పాడు.

“అలాగే ప్రభూ” అన్న మంత్రి, రాజాజ్ఞను శిరసావహించి వేయిమందిని తీసుకొని అరవై యోజనాలు ప్రయాణించి బుద్దుడు నాలుగు పరిషత్తుల మధ్యన కూర్చుని ధర్మబోధ చేస్తుండగా విహారంలో ప్రవేశించాడు. “రాజసందేశం సంగతి తరువాత” అనుకుని ఒక ప్రక్మన నిలబడి ధర్మదేశనాన్ని వింటూ ఆ మంత్రి మిగిలిన వేయిమంది తోసహా ప్రవ్రజ్యనిమ్మని అడిగి అర్హంతుడై పోయాడు. బుద్ధభగవానుడు "భిక్షులారా! రండి” అని చేతిని చాపాడు. వారందరూ కూడా ఖిక్లాపాత్ర, చీవరాలను ధరించారు. అలా అర్హంతులైన వారు “ఆర్యులు తటస్టులుగా ఉంటారు” అనుకుని సందేశాన్ని బుద్ధునికి వినిపించలేదు.

“వెళ్ళినవాడింకా తిరిగి రాలేదు. కనీసం వర్తమానమన్నా పంపలేదు” అనుకొన్న శుద్దోధనుడు, మరో మంత్రిని పంపాడు. అతడు కూడా అనుచరులతోపాటు అర్హంతుదై, రాజశాసనం విషయాన్ని పక్మనపెట్టాడు. అలా మొత్తం తొమ్మిది మంది మంత్రులను పంపగా వారందరూ ఆనుచర సహితంగా అర్హంతులై రాజశాసనం విషయంలో మౌనంధరించి, రాజగ్భహంలోనే ఉండిపోయారు. కనీసం లేఖద్వారానైనా విషయాన్ని తెలియజేయగలిగిన వారుకనబడక పోవడంతో రాజు ఇలా అనుకొన్నాడు. “నేనంటే ప్రేమ గలవారిందరు వెళ్ళికూడా కనీసం పత్రమన్నా తేలేదు. ఇపుడు నా మాటను తెలియజేయగలవారెవరు మిగిలారు?” అపుడాయన రాజపురుషుల మండలినంతా పారజూస్తూ, కాలుదాయి పై దృష్టిని నిలిపాడు. అతడు రాజుకు పూర్తి ఆంతరింగికుడూ, విశ్వాసపాత్రుడూ, సర్వార్థసాధకుడూ అయిన మంత్రి. అతడు బోధిసత్తుడు పుట్టినరోజునే పుట్టిన, బోధిసత్తుని చిన్ననాటి స్నేహితుడు కూడా. శుద్దోధనుడు అతన్ని చూసి “నాయనా కాలుదాయీ! నేను నా కుమారున్ని చూడాలనుకొంటున్నాను. తొమ్మిదివేల మందిని పంపాను కానీ వారిలో కనీసం పత్రం తెచ్చిన వారొక్కరైనా లేరు. శరీరం అస్థిర మైనది. నేను బ్రతికి ఉండగానే నా కొడుకును చూడాలను కొంటున్నాను. నువ్వు నా కుమారుని తెచ్చి నాకు చూపించగలవా?”

“ప్రభూ! ప్రవ్రజించేందుకు అనుమతి దొరికినట్లయితే తప్పక తీసుకు రాగలను.”

“ప్రవ్రజితుడినా సరే, కాకపోయినా సరే. నా కొడుకును తెచ్చి చూపించు చాలు.”

“అలాగే ప్రభూ!” అన్న కాలుదాయి రాజశాసనాన్ని తీసుకుని రాజగ్భహాన్ని చేరాడు. బుద్దుడు ధర్మదేశనం చేస్తున్న సమయంలో పరిషత్తు చివర నిలబడిన అతడుకూడా అనుచర సహితంగా అర్జంత ఫలాన్ని పొందాడు. “రండి ఖిక్ధులారా” అనగానే ఖిక్ధువైపోయాడు. సిద్ధార్దుడు, బుద్దుడైన తరువాత మొదటి వర్షావాసాన్ని బుషిపట్టణం (సారనాథ్‌)లోనే గడిపాడు. ఆ తరువాత వర్షావాసాంతంలో ప్రవారణ చేసుకొని ఉరువేలకు వెళ్ళాడు. అక్కడ ముగ్గురు జటిలసోదరులనూ సన్మార్గానికి మళ్ళించి, ఆ పై అనుచరులైన వేయిమంది జటిలురతో బాటుగా పుష్యమి మాసానికల్లా రాజగ్భహం చేరుకున్నాడు. అక్కడ రెండు నెలలున్నాదు. ఇప్పటికి వారణాశి నుండి బయలుదేరి అయిదు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019

35