పుట:Ammanudi-June-2019.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విద్యారంగం.

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ నిర్లక్షం వలన

ప్రమాదంలో తెలుగుమాధ్యమ విద్యార్థుల భవిష్యత్తు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ గత రెండు నెలల్లో పంచాయితీ కార్యదర్శి, గ్రూప్‌ 2, గ్రూప్‌ 1 సర్విస్‌లకు గానూ ప్రవేశ పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలలో ముందుగానే ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్నాపత్రాన్ని రూపొందించి తెలుగు అనువాదం మాత్రమే చేర్చుతామని తెలిపిన కమిషన్‌, ఎలాంటి నాణ్యత లేని ప్రశ్నాపత్రాన్ని తెలుగు మాధ్యమ విద్యార్థులకు అందించింది. మచ్చుకు కొన్ని

ఏప్రిల్‌ 21 న జరిగిన పంచాయతీ కార్యదర్శి పేపర్‌ లో కాంగ్రెస్‌ ను కాంగ్రస్‌ అని, మౌలిక ను మౌతిక అని, జాతీయగీతం, జాతీయ జెండాలను దేశీయ గీతం, దేశీయ జెండా అనటం. భీమా పదాన్ని ఒక చోట భిమ అని ముద్రించడం. ఇవి ముద్రణలో దోషాలనుకుందాం. alid, act, inalid, లాంటి ఆంగ్ల పదాలకు తర్జుమా చేయకుండా వాలిడ్‌, ఇన్‌వాలీడు. ఆక్ట్‌ ఇలా వదిలేసారు. ఇదే పోకడను గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, పరీక్షాపత్రాల్లోనూ అనుసరించారు.

ఆంగ్లంలో ప్రశ్నః( A సెట్‌లో 10వ ప్రశ్న - Garo hills are part of which state? దీనికి తెలుగు అనువాదం - “గారొ కొండల సమీపంలో భారతదేశంలోని ఏ రాష్ట్రముంది”. సమీపంలో/లో కి చాలా అంతరం ఉంది.

ఆంగ్లంలో ప్రశ్న : (A సెట్‌ లో 20వ ప్రశ్న) - Which countrys airline introduced the world first single use plastic free passenger flight? అనగా ఏ దేశపు విమానయాన సంస్థ మొదటిసారిగా ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ ను నిషేధించింది, అనగా తిరిగి వాడే ప్లాస్టిక్‌ ను మాత్రమే ఆ విమానాల్లో వాడతారు అని అర్ధం.

దీనికి తెలుగులో ప్రశ్న : “ఏ దేశ విమానయానంలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ ను కూడా తొలగించి ప్లాస్టిక్‌ లేని ప్రయాణీకుల విమానంగా చేసింది?” అని ఉంది. ఆంగ్ల ప్రశ్నకు పూర్తి విరుద్దంగా ఉంది తెలుగు అనువాదం.

కొన్ని ప్రశ్నల్లో పదాలు ఎగిరిపోయాయి, ఉదాహరణకు 'సెట్‌ A, 58, session.

if wall is called window, window is called door, door is called floor, floor is called roof and roof is called entilator, what will a person stand on?


ఈ ప్రశ్న అర్ధమేంటంటే, ఒక సంకేతభాషలో గోడని కిటికి అని, కిటికీని తలుపు, తలుపుని నేల, నేలని కప్పు, కప్పుని వెంటిలేటర్‌ అంటే, ఆ సందర్భాంలో మనిషి దేనిపై నిలబడతాడు, అని. అయితే కమిషన్‌ వారి అనువాదం - “గోడ కిటికి అని పిలవబడితే, కిటికీ తలుపు అని పిలవబడితే, తలుపు నేల అని పిలవబడితే, నేల కప్పు అని పిలవబడితే, కప్పు వెంటిలేటర్‌ అని పిలవబడితే, మనిషి ఏమని పిలవబడతాడు?”

అసలే ఒక రకమైన ఒత్తిడి కింద విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతారు, ఇలాంటి తప్పులున్న ప్రశ్నలు వారి ఆత్మస్థైర్యాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాయి.

ఇక మే 5 న జరిగిన గ్రూప్‌ 2 పరీక్షలో భారతాదేశాన్ని భరతదేశమని, భావనను బావనఅని, ఇలా అచ్చుతప్పులు, economy అనగా దేశాల సందర్భంలో ఆర్దిక శక్తి అని అనువదించుకోవాలి, సెట్‌ A లో 4వ ప్రశ్నలో భారత్‌ ఆర్థికంగా నిలిచింది అని ఇచ్చారు.

7వ ప్రశ్న ఆప్పన్‌లలో moderate ను ఆదునిక అని అనువదించారు, దీని వలన పూర్తి అర్జమే మారిపోతుంది.

Tsangpo ను సాంగ్‌ అని అనువదించారు. 17వ ప్రశ్నలో అమ్మిన టికెట్లు బదులు టికెట్లు అమ్మిన అని పదాలు తారుమారు అయి అర్ధం మారిపోయింది.

భారతదేశ రాజకీయాల్లో ఒక చట్టాన్ని తేవడానికి, అమలు పరచడానికి మధ్య తేడా ఉంది. చట్టాన్ని తేవడమంటే ఇరు సభలలో ప్రవేశ పెట్టడం, అమలు పరచడం అనేది ఆ చట్టంలో పేర్కొంటారు. సెట్‌ A లో 130వ ప్రశ్న ఆంగ్లంలో enact ఆనుంటే తెలుగులో చట్టాన్ని తీసుకొచ్చారు అని ఉంది.

ఇక మే 26 న జరిగినా గ్రూప్‌ 1 ప్రశ్నాపత్రానికి పూర్తి స్థాయి యాంత్రిక ఆనువాదాన్ని ఆశ్రయించినట్టు అనిపిస్తోంది.

సెట్‌ A, 49వ ప్రశ్నలో ఒక ఆప్షన్‌, 'Reduce the amount of sentence without changing its character ' అని ఉంది, ఇది శిక్షాస్మృతికి సంబంధించిన ప్రశ్న ఇక్కడ సెంటెన్స్‌ అనగా శిక్ష అని. అయితే తెలుగు అనువాదం -”వాక్యాల గుణాలని మార్చకుండా వాక్యాన్ని కుదిస్తుంది.”

ఇంకా ఎన్నో తప్పులున్నాయి. ఒక బాధ్యతగల రాజ్యాంగబద్ధ సంస్థ ఈ విధంగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడేలా ప్రశ్నా పత్రాలివ్వడం, ఆ విషయాన్ని ఎవరూ నిరసించకపోవడం మన దౌర్భాగ్యం.