పుట:Ammanudi-June-2019.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పనులు చేసే ఆడోళ్లయినా, చేను పనులు చేసే కూలోళ్లయినా, వేమన పద్దెము ఎరగనివారే ఉండరు మా తావున అట్లాంటి పద్దేలు, పాటాలుగా వచ్చేతలికి ఆశ్చర్యమయిపోయె.

మా తావున వేమన మాదిరే రామదాసు కూడా. ఇంటింటికీ జగుళ్లు ఉంటాయి కదా. వాటి అంచుల్లో గొత్తులను (కొయ్యగూటాలు) నాటి పెట్టింటారు. ఆ గొత్తులకు అనించి జగిలి పొడుగునా ఒక దూలాన్ని అడ్డం వేసింటారు. గొత్తులకు గొడ్లను కట్టేసి, జగిలి మీద కసువు వేస్తే, కసువును కిందకు లాక్కోకుండా దూలం అడ్డంగా ఉంటుంది. గొత్తులకూ దూలానికీ తాడు బిగించి ఉంటుంది కాబట్టి దూలం జరిగి గొడ్ల కాళ్లమీద పడేలేదు. రెయ్యి సంగటి తినినంక పెద్దోళ్లూ ముసిలీ ముక్కలూ జగుళ్లపైకి సేరుకొంటారు. ఒకోజత ఎద్దులకు ఒకొకరు ఎదురుగా కూకొని, జొన్నకడ్లను వాటి నోటికి అందిస్తా ఉంటారు. అట్ల అందియ్యకపోతే అవి ఉత్త అకుల్నే తినేసి దిండ్లను వదిలేస్తాయి. అట్లాంటపుడు మాయట్ల సిన్నోళ్లు కూడా పెద్దోళ్ల పక్కలో దూరుతాము. నిదరకు తూగిడిచ్చి సేతివేళ్లని గొడ్ల నోటికి ఇయ్యకుండా ఉండేకి మా పెద్దోళ్లు బద్రాచలం రామదాసు పాటలు పాడతారు. “ఏ తీరుగ నను దయజూసెదవో...'పలుతే బంగారమా యెనా...” ఇచ్చాకు కుల తిలక...” వంటివి ఎన్నో పాటలు తాతల తండ్రుల నోళ్ల నుండి మాకు అందతా వస్తా ఉంటాయి.

రెయ్యంతా రామదాసు కీర్తనలు ; పొద్దున్నే కైవారం తాతగారి తత్వాలు; వేమన, సుమతి, నరసింహ శతక పద్యాలు; పెద్ద బాలశిక్ష తరగతి వాచకం; అలలు అలలుగా జనం నోళ్లనింకా తెలుగు వెల్లువలయి దుమికే మా రాజ్యంలో మా తొలి సదువు ఇట్లా ఆరంబమయి కొనసాగింది.

(తరువాయి రాబోయే సంచికలో...)

స్పందన

మే నెల 2019 అమ్మనుడిలో ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారి కథ “పేరు బలం” చాలా గొప్పగా ఉంది. చక్మని కథనంతో సందేశాత్మకంగా ఉంది. ప్రతిభావంతులు రాసిన కథలో ప్రతిభ అంతా ప్రతిబింబిస్తోంది

జోళదరాశి (గుత్తి) చంద్రశేఖరరెడ్డిగారితో ముఖాముఖి కూడా బాగా నచ్చింది. రాజకీయాల రణగొణలో భాష దెబ్బతినడం చక్కగా వివరించారు. కన్నడిగులతో విడిపోవడమే ఒక పెద్దతప్పు అయితే, తెలుగువారు. వారిలోవారే ఇప్పుడు రెండుగా చీలికలై పోవడం మరింత విచారకరం. మన అమ్మనుడిని రక్షించుకునేందుకు మనంపడే పాట్లు చూస్తే బాధగా ఉంది.- పాలెపు బుచ్చిరాజు (బరోడా)


(36 వ పుట తరువాయి)

కుమ్మరి వృత్తి అత్యంత ప్రాచీనమైనది. కుండకు అత్వంత ప్రాధాన్యత కూడా ఉంది. క్రీ.పూ. 5500 ప్రాంతంలో మెసవటోమియా నాగరికత కాలానికే కుండవున్నట్లు ఆధారాలున్నాయి. చలివేంద్రం, కుమ్మరి కులవృత్తి జీవితంలో వ్యయప్రయాసల్ని తెలిపే కథ. రచయిత జాతశ్రీ. కాగుబొత్త కధ కూడా పెద్దింటి ఆశోక్‌, కమ్మరి కథల్లో ఈ భూమినాది, కొడుకురాకపాయె, పాటర్ససర్కిల్‌, చిప్ప వండ్రంగి కథ, అన్నంగుడ్డ సుంకోజిదేవేంద్రచారి, జాతశ్రీ కుట్ర వృత్తిలో నైపుణ్యం వున్నా యంత్రాలు వచ్చాక చాలావరకు వడ్రంగి జీవితం దుర్భరంగా మారింది రాసాని కొలిమి, శిరం సెట్టి కాంతారావు నేలమీద జాబిలి, దిలావర్‌ గూడు చెదిరిపోయింది. మంగలి అడపం కథ తుమ్మలరామకృష్ణ చేతి వృత్తి చేసే వాళ్ళ ఏమాత్రం బాగుపడినా ఓర్చని జనం గురించి తెలుపుతుంది,అతుడు బయల్టే రాడు : రాష్తాడు గోపాలకృష్ణ కథ రాయసీమ ప్రాంతానికి చెందినదైన అంతటా అన్వయించకో వచ్చు. “బీడి వోడు” ఉప్పర కులసుడు అడివోడు అందరికీ క్షవరం చేసి కులవ్యష్ట్‌ను తుడిచేయాలనుకొంటాడు. పతంజలి, వివినమూర్తి కలింగాంద్ర బహుజనుల బాధలను చిత్రీకరించారు. శాంతి నారాయణస్వామి, రాసాని రాయల సీమ బహుజనుల కడగండ్లను కళ్లకు కట్టారు. ఖదీరు బాబు: ఖాధర్‌ లేడు. షాజహాన్‌ రాసిన సండాసీ, సిలసిలా సండాసీ . పాచికలు షేకుసేన్‌ హునర్‌ నరికి లక్షణ్‌ అంటారు. చేతివ ఎత్తి మగానిలక్షణం అని గర్వంగా చెప్పుకొంటాడు. శశిశ్రీ దహేజ్, రాతిలో తేమా, అక్కంపేట, ఇబ్రహీం జీవసమాధి ? ఎన్నెస్‌ ఖలందర్‌ మున్నీబేగం ముస్లిం జీవన స్వభావ నైజం గుణాలను తెలిపే కథలు.

సత్యాగ్ని యంత్రం, హుసేన్‌ సయ్యద్‌ సలీం బారహతుల్లో స్కైబాబా, షాజహాన్‌, వేంపల్లి షరీఫ్‌, ఎన్నీస్‌ ఖందరు ముస్లింకథల్లో ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు. గీతాంజలి, పెహజాన్‌, చ, హిందూ ముసల్మాన్‌, ఆళ్వారుస్వామి, కాఫీ, బుచ్చిబాబు, కేతువిశ్వనాథరెడ్డి పీర్లసావిడి ,ఓల్లా సారీజాఫర్‌, రాసాని బుసీ ఫెలస్‌, నువ్వు

అనాధవికావు, శ్రీపాద గులాబీత్తరు గురజాడ పెద్ద మసీదు మైనారిటీవాదాన్ని బలంగా వినిపించే కథలు. ఇలా అన్ని ఉత్పత్తి కులాల కథలు వచ్చినా పరిస్థిలో మాత్రం మార్పు ఆశించినంతగా రాలేదు. లోపం రచయితల్లో వుందా లేక పాఠకుల్లో వుందా లేదా పాలకుల్లో వుందా అనేది తెలియాలి. బహుజనులు అనే పదం మందిని కలువుకొని పోవడానికి తప్పితే మార్చు మాత్రం అంతంత మాత్రమే. ఇంకా దళితుల పైన దాడులు ఆగలేదు, దేవాలయాల ప్రవేశం నిషేదం కొనసాగుతోంది, దళితులే కాకుండా మిగిలిన ఉత్పత్తి కులాలు కూడా అగ్ర కులాలవారితో అనేక శోషణలు ఎదుర్కొంటున్నారు. బహుజనులు ఇంకా ఓటరు గానే వుంటున్నారు తప్పితే పాలించే దిశగా చాలా వెనుకబడ్దారు. అజ్ఞానం,అవిద్య మూఢనమ్మకాలు బహుజనులు విడనాడాలి మనిషిని మనిషిగా చూపే సమాజం మనందరు నిర్మించుకోవాలి.

రచయిత : అసోసియేట్‌ ఫెలో ప్రాబీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం. మైసూరు.

46

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్‌ - 2019