పుట:Ammanudi-June-2019.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వయోజన విద్య

వై. ఇంద్రాణి 9246245909

1951 నుండి దేశంలో వయోజన విద్య-ఒక సమీక్ష

మనిషి సర్వతోముఖాభివృద్ధి సాధనలో విద్యది అత్యంత కీలక పాత్ర. ఒక దేశపు అభివృద్ధి, అభివృద్ధిని స్థిరపరచడంలో విద్యది ప్రధాన పాత్ర. ఒక్కమాటలో భవ్య భవిష్యత్తుకు తిరుగులేని పెట్టుబడి విద్య. అభివృద్ది చెందిన దేశాలు అక్షరాస్యతలో ముందున్నాయి, వెనుకబడిన దేశాల్లో నిరక్షరాస్యత ఎక్కువ కాబట్టి ఐక్యరాజ్యసమితి కూడా అభివృద్ధి ప్రమాణాలలో అక్షరాస్యతను చేర్చింది. 15 దాటిన పెద్దలకు అందించే విద్యను వయోజనవిద్య అంటున్నాం. వయోజన విద్యకు అనేక నిర్వచనాలు.

చదువుకునే వయసులో అవకాశాలు పొందలేకపోయినవారు, ఇప్పుడు చదువుకోడానికి కల్పించే అవకాశం వయోజన విద్య అని చెప్పుకోవాలి. అక్షరనైపుణ్యాలనే కాక, వెనుకబాటుకు కారణాలు తెలుసుకుని, ఎదగడానికి ప్రయత్నించే సామాజికసృహను, అవసరమైన వారికి వృత్తినైపుణ్యాలు, జాతీయ విలువల పరిజ్ఞానాన్ని అందించేది వయోజన విద్య. వయోజన విద్య కేవలం అక్షరాస్యతమాత్రమే కాదు కాబట్టి దానిని అక్షరాస్యతంగా చెప్పవచ్చు. అండులో జీవన పర్యంత విద్య, నిరంతర విద్య, బడి బయటి పిల్లల విద్య, వెనుకబడిన వర్ధాల వారికి కావలసిన విద్య, వీధిబాలలకు విద్య, కార్మికులు మొదలైనవారికి చెప్పే విద్య, అన్ని కూడా భాగాలే. జాతిపిత నిరక్షరాస్యత దేశానికి కళంకం, నిర్మూలించి తీరాల్సిందే అని ఆనాడే పిలుపిచ్చారు.

మన దేశంలో 1951 నుండి వయోజన విద్య - చారిత్రక నేపథ్యం :

ప్రారంభంలో (1948) వయోజన విద్యను సామాజిక విద్య (సోషల్‌ ఎడ్యుకేషన్‌) లో భాగంగా భావించారు. తొలి కేంద్ర విద్యామంత్రి మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ వయోజనులకు అందించే విద్య, వారిని విద్యావంతులను చేయడం మాత్రమే కాదు, సమగ్ర, సామాజిక అభివృద్ధి దిశగా చేసే ప్రయత్నం అన్నారు. జనబాహుళ్యంలో ఉత్పాదకశక్తిని పెంచే ఆలోచనను రేకెత్తింపచేసేది వయోజన విద్య అన్నారు. సెంట్రల్‌ అడ్వయిజరీ బోర్ట్డు ఆఫ్‌ ఎడ్యుకేషన్‌? వారు సామాజిక విద్య భావనను ఆమోదించి, 1949 ఫిబ్రవరిలో జరిగిన కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ప్రొవెన్నియల్‌ ఎడ్యుకేషన్‌ మినిస్టర్స్‌: లో చర్చించారు. 1949లో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలన్న సూచనలు జారీ అయ్యాయి. సామాజికవిద్య మొదటి మూడు పంచవర్ష ప్రణాళికలకాలంలో (1951-56, 1956-61, 1961-66) మంచి ఫలితాలనే సాధించింది. 3, 4 ప్రణాళికల కాలంలో చర్చల్లొకి

వచ్చిన వయోజన కార్యనిర్వాహక విద్యా భావన, 4వ ప్రణాళికలో బలపడింది. 1969లో నేషనల్‌ బోర్జ్‌ ఆఫ్‌ అడల్ట్ ఎడ్యుకేషన్‌, 1971లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ ఏర్పాటు, నాన్ఫార్మల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం ప్రారంభాలతో, ప్రోగ్రాం ఆఫ్‌ రూరల్‌ ఫంక్షనల్‌ లిటరసీ అసోసియేట్‌ అయ్యింది. దేశ సమగ్రాభివృద్ధికి అత్యంత కీలకంగా భావించి 1978 అక్టోబర్‌ 2న ప్రాధాన్యతా కార్యక్రమంగా నేషనల్‌ అడల్డ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం (ఎన్‌ ఏఇపి)ని ప్రారంభించారు. ఆర్థిక, సామాజిక, స్త్రీ పురుష అంతరాలను తగ్గించడంలో వయోజన విద్య చెప్పుకోదగ్గ పాత్ర పోషించగలదని, 1986లో నేషనల్‌ పాలిసీ ఆన్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌ పిఇ) అవసరాన్ని నొక్కి చెప్పింది. 1992లో ప్రోగ్రాం ఆఫ్‌ యాక్షన్‌ (పి.ఒ.ఏ) లో నేషనల్‌ ప్రోగ్రాం ఆఫ్‌ అడల్డ్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌ పి ఎ ఇ) ని ప్రకటించారు. దాని లక్ష్యమైన వంద మిలియన్లలో 1990 కల్లా 15-35 వయసుగల 40 మిలియన్లు, 1995 కల్లా మరో 60 మిలియన్ల నిరక్షరాస్యులను చదివించడానికి కాలపరిమితిగల అంచెలవారి వయోజన విద్యా కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ ఎన్‌ పి ఎ ఇ ప్రకారం రూరల్‌ ఫంక్షనల్‌ లిటరసీ ప్రోగ్రాం, స్టేట్‌ అడల్డ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం (ఎస్‌.ఎ.ఇ.పి), ప్రోగ్రాం ఆఫ్‌ అసిస్టెన్స్‌ టు వాలంటరీ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని భావించారు.

నేషనల్‌ లిటరసీ మిషన్‌ 1988 :

సాక్షరత సాధనకు, 1988 మే 5న నినేషనల్‌ లిటరసీ మిషన్‌ (ఎన్‌. ఎల్‌ ఎం.) ను ప్రారంభించారు. దీనిని నేషనల్‌ పాలసీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ 1986, నేషనల్‌ అడల్డ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాంల లోటు పాట్లను పరిశీలించి, దిద్దుబాట్లతో రూపొందించారు. ఈ కార్యక్రమంలో 100 మిలియన్ల పూర్వ లక్ష్యాన్ని 80 మిలియన్లకు కుదించారు. 1990 నాటికి 30 మిలియన్ల, మిగిలిన 50 మిలియన్ల నిరక్షరాస్యులను 1995 కల్లా అక్షరాస్యులను చేయాలి. లక్ష్య సాధనకు, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖలోని డిపార్టమెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్లో, స్వయం ప్రతిపత్తితోని నేషనల్‌ లిటరసీ మిషన్‌ అధారిటీ (ఎన్‌ఎల్‌ఎంఏ) ని 1988 జూన్‌ లో ప్రారంభించారు. మాస్‌ ప్రోగ్రాం ఆఫ్‌ ఫంక్షనల్‌ లిటరసీ (ఎంపిఎఫ్‌ఎల్‌), రూరల్‌ ఫంక్షనల్‌ లిటరసీ ప్రోగ్రాం, (ఆర్‌.ఎఫ్‌.ఎల్‌ పి), స్టేట్‌ అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను ఎన్‌ఎల్‌ ఎం చేపట్టింది.

అభ్యసన బోధనాసామగ్రి, విధివిధానాల రూపకల్పన, సిబ్బందికి శిక్షణ, అధ్యయన మూల్యాంకనలు, ప్రయోగాలు, పరిశోధన, సాంకేతిక, విద్యా వనరుల సహకారాన్ని అందించదంకోసం స్టేట్‌ రిసోర్స్‌ సెంటర్స్‌ (ఎస్‌.అర్‌.సి.) లు ఏర్పడ్డాయి.

1988-89 సంపపలో టోటల్‌ లిటరసీ క్యాంపేన్‌ (టిఎల్‌సి) ను, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల నేషనల్‌ సర్వీస్‌ స్మీమ్‌

24

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ 2019