పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

అమెరికా సంయుక్త రాష్ట్రములు

'సౌతుకారొలీనా అనుతొమ్మిది రాష్ట్రముల నుండియు ప్రతిని ధులు వచ్చిరి. ఆంగ్లేయ రాజునకొక అర్జీని ఆంగ్లేయ పార్ల 'మెంటున కొక మహాజగును తయారుచేసి పంపిరి. వాటిలో తమకు ఆంగ్లేయ ప్రభుత్వము వారిచ్చిన దానశాసనముల సంగతి యుదాహరించలేదు. తమహక్కులను వాటిమీద యాధార పరచ దలచలేదు. సహజమైన మానవహక్కుల మీద నాధారపడదలచుకొనిరి. ఆగ్లేయ పార్ల మెంటులో తమకు పాతిధ్యము కావలెనని కోర లేదు. పదునె దువందల మైళ్లదూరమున నుండి అధిక సంఖ్యాకులగు నాంగ్లేయు ప్రతినిధులచే నిండిన పార్లమెంటులో తమకు కొంత పాతినిధ్య మున్నను ప్రయోజనములేదని ఎంచిరి. తామాంగ్లేయు ప్రభుత్వమునకు లోబడియే యున్నా మని యొప్పుకొనిరి. కాని 'తము యిష్టం లేని ది తమమీద పన్నులు వే యిట కాంగ్లేయ ప్రభుత్వమునకు హక్కు లేదని ఏips , కు pa / a s... ఏ దేశ ప్రజలమీద నయినను వారి యనుమతి లేనిది వారిమీద పన్ను లు వేయు.ట-ఎవ్వరికిని హక్కు లేదను 'సామాన్యసిద్ధాంతము నే నాధార పరచుకొసరి.

{స్టాంపుల చట్టము
రద్దు పడుట

అక్టోబరు 31 వ తేదీన గోల్డము మొదలగు నాంగ్లేయరాష్ట్రపాలకౌలెల్లరు మరుసటి దినము నుండి సాంపుచట్టము నమలులో పెట్టుదుమనిప్రమాణములు గావించిరి. కాని నవంబరు మొదటి తేదీన వలసరాష్ట్రములన్నిటిలో నొక స్టాంపుల నమ్ము యుద్యోగియైన లేడు. ఒక స్టాంపయినను. కంటిక గుపడ లేదు. ఆదినము ననేక పట్టణములలో ప్రజల యూ రేగింపులు జరిగి ,