పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

అమెరికా సంయుక్త రాష్ట్రములు



రాష్ట్రము లింగ్లాండువకు ఎగుమతిచేయుసరుకుల నింగ్లీషు యోడలలోనే వంపవలెనని ప్రధమమున 1652 సంవత్సరమున చట్టము చేసిరి. తరువాత వలసరాజ్యముల వారు ఏదేశముతో వర్తకము చేసినను ఎగుమతి దిగు మతి యగు సరకు లన్నియు నింగ్లీషు వారిచే నడుపబడు నింగ్లీషు యోడల లోనే రాకపోకలు చేయు లెనని 1664 సంవత్సరమున మరియొక శాససమును చేసిరి. ఇంగ్లాంకు దేశముద్వారా తప్ప సరాసరి యూరపు ఖండములోని ఏదేశమునుండియు సరుకులను కొసగూడదనియు నాంగ్లేయులు తప్ప విదేశీయు “లెవరుసు నీ వలసరాష్ట్రము లో వర్తకులుగ నుండగూడదని యు 1662 వ సంవత్సరమున నింకొక చట్టము గావించిరి.

{ఎగుమతి దిగుమతి
పన్నులు}

ఆగ్లేయ ప్రభుత్వము వా రింతటితో నూరుకొ నక ఎగుమతి దిగుమతి వలస రాస్ట్రములలో నొక దాని నుండి మరి యొక దానికి ఎగుమతియగు వంట దినుసులమీదకూడ పన్నులు విధించి వలస రాష్ట్రముల లో ఫలించు ముఖ్యపంట దినుసు.ఇంగ్లాండు నకుతప్ప మరి యేదేశ మునకును యెగుమతి చేయకూడదని నిషేధించిరి. ఈచట్ట ములవలన వలసరాష్ట్రముల కన్ని టికిని అపారమగు నష్టము కలి గెను. ఇష్టము వచ్చిన దేశములలో చౌకగాని ప్రియము గా అమ్ముకొను వర్తక స్వేచ్చ నశించినది. వలసరాష్ట్రము కొన్ని ఈ చట్టములను తిరస్కరించి ప్రపవర్తించసాగెను. మేస షు సెట్సు రాష్ట్రమువారీ చట్టములను పదిసంవత్సరముల వరరకు అమలులో పెట్టుటకు నిరాకరించిరి. ఈ రాష్ట్రపు పతినిధిసభ వారు తమ రాష్ట్రమునకు నష్టకరమగునట్టియు తాము చేయు .