పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

అమెరికా సంయుక్త రాష్ట్రములు


కొట్టిచంపెను. ఈమైంటోనోమో ఇదివరకాంగ్లేయులకు పరమ మిత్రుడుగ నుండెను.

{న్యూహాంపషైరు}

1622 సంవత్సరమున కొందరాంగ్లేయులు ప్లిమతు సంఘమునుండి దానపట్టాను పొంది యంరికాకువచ్చి న్యూ హంపు పైరు వలనను స్థాపించిరి.

{రోడు అయిలండు}

మెసషు నెట్ను రాష్ట్రము లో రోగరు విలియమ్సు అను మతబోధకుడు మనస్సాక్షి ప్రేరేపించిన ప్రకారము ఈశ్వరుని ప్రతివారు నారాధింపవచ్చు నని బోధించెను. ఇందు కారాష్ట్రములోని ప్యూరిటసు క్రైస్తవులీతనిని బహిష్కరించిరి. రోగరువిలియమ్సు పారి పోయి పదునాలుగు వారములు తిండి విశ్రాంతి ఎఱుగక తిరిగెను. ఆంగ్లేయులెవరు నీతనికి తావునివ్వలేదు. నరగనునె టులను ఎర్రయిండియనుల జాతివారి ప్రభువగు మైంటోనో 'మో ఈతని నాదరించి యతిథ్యమిచ్చి విశేష విస్తీర్ణముగల భూ మి, దానముచేసెను. ఇందులో అతను నివసించెను. కొలది కాలములో ననేక మంది యాంగేయు లిచటకు వచ్చి కాపుర ముండిరి. దీనికే రోను అయిలండని పేరు. ఈ మెంటోసోమా ప్రభువునే కనెక్టికటు రాష్ట్రపు ఆంగ్లేయులు మరణశిక్ష విధించి శంపించి యుండుట మనము చూచి యున్నాము. రోడు అయిలండులో సంపూర్ణ ప్రజాస్వామ్యమును పూర్తియగు మత స్వే చ్చయు నెలకొల్పబడెను.

మెసషు సెట్సు వలసనుండి జూన్ ఎలియటను అంగ్లేయుడు -