పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ అధ్యాయము

33


సంపాదించిరి. నర్రగనుసెటు జాతి వారిని కూడ తమలో జేరవలెనని ఆంగ్లేయులు కోరిరి గాని వారు చేర లేదు. ఆంగ్లో యులును మొహగను జాతివారుసు అర్ధ రాత్రి వేళ పికెడుజాతి వారి ముఖ్య గ్రామము మీద నాకస్మికముగ పడి అన్ని యిం డ్లను తగుల బెక్టిరి. తగులవడుచున్న యిండ్లలోనుండి తప్పించు కొని బచుటకు వచ్చుచున్న పురుషులను స్త్రీలను శిశువులను పధించి ఒక గంట సేపటిలో నారువందలమందిని చంపిరి. ఆసమయమున నిద్ద రాంగ్లేయులు మాత్రము మరణించిరి. మరు నాడు మూడు వందలమంది పికెడు జాతి వారు యుద్ధమునకు రాగ వారా నాంగ్లేయులోడించి చాలమంది హతులను జేసిరి. మిగిలినవారు పారిపోయిరి... అజాతిలోని తక్కి ననారి నందరిని ఆంగ్లేయులును వారి మిత్రులగు నెర్రయిండియములును ఒక ప్రదేశము నుండి మరియొక ప్రదేశమునకు వెంటనంటి తరుముచు దొరికిన వారినల్ల నరికి వేసిరి. వారిలో రెండు వందలమంది శరణాగతులుకాగా వారు బానిసలుగ చేయబడిరి. మిగిలిన పికెడు జాతీయంతయు నిర్మూలమయ్యెను. నరగను సెటుజాతి వారీయ ద్దములో తమతో జేర లేదని వారిరాజగు మైంటోనో మో తమమీదకుట్రలు పన్ను చున్నాడని ఆంగ్లేయు లు నేరోపణ చేసిరి. ఆయన తానేమి చేయలేదనియు తన విరోధియగు మొహగనుల బాసురాజు అబద్దములు చెప్పి నాడనియు నాయన చెప్పెను. ఆంగ్లేయులు మైంటొనోమోను విచారణకు తెచ్చి నేరస్థుడని తీర్మానించి మరణశి. విధించి. చుపుటకు మొహగసుల రాజునకు వప్పగింత చేసిరి. మొహా గసుల రాజు యొక్క తమ్ముడు మైంటోనో మో తలమీద నులితో