పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

అమెరికా సంయుక్త రాష్ట్రములు


హత్యకు సంబంధించినటుల ఆరుగురు నీగోలు వైదులో సంచబడిరి. కొంతమంది తెల్లవారు మోటారు కారులో వచ్చి యొక ఫోజరీ టెలిగ్రామును జై లరు కుమారునికి చూపి జెలులోనుంచి వారి యూరుగురిని తీసికొనిపోయి చిత్రవధలను గావించిరి. వారిలో నొకడు మాత్రమే హత్యకు సంబంధించిన నేరము మోపబడినటుల తేలినది,

. - ఆగస్టు 18 -- ఒక నీగ్రో తాగి యొక తెల్లవానిని తుపాకితో కాల్చిచంపెను. ఆనీగ్రో ఆనుపత్రిలో పడుకొని యుండగా కొందరు తెల్లవారు వానిని తిసుకొనిపోయి మంటల లోపడ వేసి చంపిరి. మంటలలోనుంచి లేచి బయటకు రాప్రయత్నించగ వానిశరీరమును కర్రలతో గుచ్చి తిరిగి మంటలోకి తోసి, " ఈ వినోదము " ను సల్పినందుకు వీరివి పట్టుకొని విచారించి కేసుకొట్టి వేసిరి.


జులై - లారెన్సు వెల్లీలో న్యాయాధిపతిగ నున్న చార్లెసు బ్రాండుగారివద్దకు యిద్దరు నీగ్రోలు విచారణకు తేబడిరి. ఒకని పై ఒక తెల్ల స్త్రీని అవమాన పరచినందుకును మరియొకడు అనుమానముగా తిరుగుచున్నాడనియు నేరమాపాదించిరి. వీరిలో నొకడు యిద్దరు పోలీసువారి 'హావాలాలో రైలులో పోవుచుండగ చాలమంది తెల్లవారు వానిని లాగు కొనిపోయి చిత్రవధ గావించిరి. ఆ చిత్రవధ జరిగినపుడు రైలు ఆగెను. రైలలోని ప్రయాణీకులు వినోదమును చూచు చుండిరి. రెండడవాడు జైలులో నుండగ అనేక వందల మంది తెల్లవారు వచ్చి వానిని లాగుకొనిపోయి చిత్రవధ గావించిరి. పటాలములను పిలిపించి, గుంపులను చెదరగొట్టి ఈ యిద్దరు