పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పన్నెండవ అధ్యాయము PLE

289

269

పన్నెండవ ఆధ్యాయము


ఖైదీలను యేల సంరక్షించలేదని ప్రశ్నించగా న్యాయాధిపతి యగు బాండు యిటుల చెప్పెను.

" దేశములోని యిట్టి నీగ్రో నేరస్తు లందరికొరకునుయే తెల్లవాని జీవితమునైన బలి యిచ్చుటకు నేను ఒప్పుకోన జూలను. ......... నా మనస్సాక్షి కివి నా భగవంతునికి... నేమ చేసినపని న్యాయముగా నున్నది. ఇట్టి నూరుమంది నీగ్రోల , ప్రాణములను కాపాడుటకై యొక్క తెల్లవాని ప్రాణముసకైన అపాయకరమగు కార్యమును నేను చేయజాలను, ”


అమెరికాలోని తెల్ల వారిలో నీగ్రో లను గూర్చి మూడువిధములైన యప్రాయములు గలవు. కొద్ది మంది యుత్తములు భగవంతుని యెదుట తెల్లవారును నీగ్రోలును సమానులు గావున యభయుల మధ్యను ఎట్టి భేదములు సుఁండగూడదని తలచు చున్నారు. మరికొందరు నీగ్రో లయం దసహ్యము చూపుట చెడు పని యేగాని నీగ్రో లకును తెల్ల వారిని నాగరికతలో చాల భేదమున్నది గావున సాధారణముగా నీగ్రో లను తెల్ల వారితో సమానముగా చూడుట అసంభవమనియు వారిలో విద్యాధికులడు, యెక్కువ నాగరీకులను తెల్లవారితో సమానముగ చూచుటకెట్టి యభ్యంతర ముండగూడదనియు చెప్పుదురు. మూడవ రగమువారు నీగ్రో యేప్పటికిని తెల్లవాడు కానేరడనియు స్వభావముగా సల్లవారికిని తెల్ల వారికిని గల భేదము విద్యవలవసు పైమెరుగులవలనను పోవునది కాదనియు గావున నీగ్రో ను తెల్లవారితో సమాసముగయెన్నటికి చూడగూడదనియు నమ్ముచున్నారు. వీరే అధిక సంఖ్యాకులుగనున్నారు.