పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

266

అమెరికా సంయక్త రాష్ట్రములు

నల్లవారి సాంఘిక
బహిష్కారము.

తెల్లవారిని నల్ల వారికిని అందరును క్రైస్తవులే నెల్లగా సాంఘిక యైనను ప్రార్ధనామందిరములు వేరుగనున్నవి. తెల్ల వారి పూటకూండ్లయిండ్లు వేరు. నల్ల. వారి పూటకూలిబసలు వేరు. పట్టణములలో వల్లెలలోను తెల్లవారు కాపురముండు ప్రదేశములలో నల్లవారు కాపురముండుటకు వీలు లేదు. నల్లవారు కాపుర ముండుటకై ప్రత్యేక ప్రదేశములు ఏర్పాటు చేయబడినవి. న్యాయస్థానములలో తెల్ల వారికిని సల్ల వారికిని తగాదాలు కలిగినపుడు తెల్లవారికి పక్షపాతమును నల్ల వారికి అన్యాయమును చేయ బడుచున్నది. ఒకేనేరములకు తెల్లవారికి తేలికగుళిక్షలును, నీగ్రోలకు కఠినశిక్షలును తెల్లని న్యాయధి పతులచేత వేయబడుచున్నవి. నీగ్రోన్యాయాధిపతులు లేనే లేరు.


నీగ్రోలను చిత్ర
వదలు చేయుదురు


నీగ్రోలయందు తెల్లవారు చూపుచున్న అసహ్యమునకు ఘోర నిదర్శనము నీగ్రోలను విచారణ లేకుండా తేల్లవారు చేయచున్న చిత్రవధలే అమెరికాలోని నీగ్రోలు తెల్లవారి కపచార మొనర్చిరని నమ్ముటతోడనే తెల్ల ప్రజలు గుంపులు గుంపులంగా బయలుదేరి నేరముచేసినట్లు తలచిన నీగ్రోలను తమంతట తామే పట్టుకొని వచ్చి చిత్రవధలను గావింతురు. ఇందుకీ తెల్లవారు శిక్షింపబడరు. విచారణతోసు న్యాయాధిపతుల తీర్పులతోను పనిలేకుండ ఉద్రేక వూరితులగు తెల్లప్రజలే నీగ్రోలను చిత్రవధలు చేయుటయు యిందుకు తెల్లవారి కెట్టి, శిక్షలును లేకుండుటయు ప్రపంచములో కెల్ల మిగుల నాగరీ కుల