పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పన్నెండవ అధ్యాయము

268


తరుచుగా రైలు వేలలో తెల్లవారికి మంచి సదుపాయములను నల్లవారికి తక్కువవీళ్ళును చేయబడుచున్నవి.

తెల్లవారు
నల్లవారు కలిసి
చదువుకొనరాదు.

దక్షిణ రాష్ట్రములలో తెల్లవారి పిల్లలును సల్లవారి పిల్లలును ఒకే పాఠశాలలో చదువుకొన గూడదు. కొన్ని రాష్ట్రములలో నీగ్రోలకు తెల్ల వారును తెల్లపిల్లలకు నీగ్రోలును ఉపాధ్యాయులగ నుండగూడదని చట్టములను చేసిరి.

నీగ్రోలు అమెరికాలో
మాల మాదిగెల కన్న
హీనముగ చూడబడుదురు.


(3) ఉత్తర రాష్ట్రములలో కూడ కొంత కాలముకు నీగ్రోలయం దసహ్యము కలిగెను. బానిసత్వపు యుద్ధపు కాలమున నీగ్రోల యభివృద్ధి కొరకు ఉత్తరాది తెల్లవారు చేయుచుండిన సహాయముసు క్రమ క్రమముగా మాని వేసిరి, నీగ్రోలు తమకన్న తక్కువ జాతీయసంభావము ఆమెరికాలోని తెల్లవారందరిలోను తీవ్రముగ వ్యాపించినది. ఎవరో కొద్దిమంది 'నీగ్రోలకొరకు పనిచేయు క్రైస్తవమత బోధకులు లిప్ప మిగిలిన తెల్ల వారందరును నీగ్రోలను హిందూ దేశములోని మాల సూది గెలకన్న హీనముగ చూతురు. తెల్లవారి పూటకూళ్ళ యిండ్లలోనికిని, క్రైస్తవ యువజన సంఘములకుసు, క్రైస్తవ యుపతీజన సంఘములకును , నాటక శాలలకును నల్లవారిని రానివ్వరు. తెల్లవారిని పాతి పెట్టు చోట నల్లవారిని పాతి పెట్టనివ్వరు.