పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

అమెరికా సంయుక్ట రాష్ట్రములు


కృత్యమనియు బానిసత్వమునకు వ్యతిరేకులగు ఉత్తగాది కక్ష వారు ఆందోళనమును చేసిరి. మానవ స్వాతంత్యమునకై ప్రాణములర్పించిన ధీరు లగు జాన్ బ్రౌను యొక్కయు ఆతని నలుగురు కుమాళ్ళ యొక్కయు, ఆకారములు ఓట్లనిచ్చు ప్రజల యొక్క దృష్టిలో కనపడుచుండెను. 1860 వ సంవత్సరము నవంబరు నెలలో శాసనసభల ఎన్నికలు పూర్తి అయ్యెను. బానిసత్వమును సంపూర్ణముగా రద్దుపర్చవలె నను కక్షికి చెందినవారే అధిక సంఖ్యాకులుగ ఎన్నుకొనబడిరి. ఆకక్షి నాయకుడగు అబ్రహాం లింకను అమెరికా సంయుక్త రాష్ట్రములకు అధ్యక్షుడుగ నెన్ను కొనబడెను. లోకము లోని దీనులకొరకును దార్భాగ్యులకొరకును పశ్చాత్తాపపు నొందు పాపులకొరకును సిలువమిద ఘోర మరణము నొందిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధలకు జయము కలిగెను.

దక్షిణ
రాష్ట్రముల
తిరుగుబాటు.


ఇందు మీద కొన్ని దక్షిణరాష్ట్రములలో పుట్టిన క్రోధమునకు మేర లేదు. 1860 వ సంవత్సరము డిశంబరు నెల 17 వ తేదిన దక్షిణ రాష్ట్ర ములలో చేసిన దక్షిణ కారొలీనా రాష్ట్రము వారు సంయుక్త రాష్ట్ర ప్రభుత్వము బానిసత్వమును రద్దుపర్చుటకు బద్దకంకణులై యున్నది గావున తాము సంయుక్త రాష్ట్ర ములలోనుంచి చీలిపోయి స్వతంత్రమును స్థాపించుకొని నామని ప్రకటించుచు బానిసత్వము సంగీకరించు తక్కిన 'రాష్ట్రముల వారును తమువలెనే స్వతంత్రమును ప్రకటించవలెపని కోరిరి. కాని మెటనే దక్షిణరాష్ట్రములన్నియు సం