పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదకొండవ ఆధ్యాయము

255


యుక్త ప్రభుత్వమునుండి చీలుటకు సమ్మతించలేదు. ములు రాష్ట్రము లలో బానిసత్వమునందెంత, పేరుగలదో సంయుక్త ప్రభుత్వ పధతి యందునుకూడ సంత ప్రేమగలదు. 1861 వ. సంవత్సరము' ఫిబ్రవరి 1 వ తేదీవరకు ఆరురాష్ట్రములవారు దక్షిణ కారోలినా రాష్ట్రమువారి మార్గము ననుసరించి సంయుక్త ప్రభుత్వమునుండి చీలుటకు తీర్మానించిరి. ఇంకను నాలుగు రాష్ట్రముల వారు బాని సత్వము: సందు ప్రేమయున్నను. సందేహ మనస్కులై నిరీక్షించుచుండిరి.


విడిపోయిన
రాష్ట్రములు


1861 వ సంవత్సరము పిభ్రవరి నెల 4 వ తేదీన విడిపోయిన ఏడు రాష్ట్రముల ప్రతినిధులును విడిపోయిన రాష్ట్రముల ప్రతినిదులు మాంగొమరీ పట్టణమున సమావేశమై యొకసంయుక్త రాజ్యంగ విధానము నేర్పరచుకొనిరి. ఈ నూతన ప్రజాస్వాహ్యమునకు పునాది బానిసవ్యాపారము. అమెరిళాఖండమున బానిసలు కావలసిన తెల్లవారందరును, ఇందు చేరవచ్చునని ప్రకటించబడెను . " నల్లగాడగు నిగ్రో తెల్లవానికన్న తక్కువ వాడనియు ఆతని స్వభావముగు స్తితి బానిసత్వమనియునను గొప్పసత్యమే ఈ నూతన ప్రజా స్వామ్యమునకు పునాది రాయి" యని ఉపాధ్యాక్షుడగువెన్నగారు చెప్పిరి. మిసిసిపీ ప్రాంత కాపరస్తులగు జెఫర్చ సుడేవిసు నూతన సంయుక్త ప్రభుత్వమున కధ్యక్షుడుగ నెన్నుకొనబడెను. ఫిభ్రవరి నెల 18 వ తేదీనుండియు నీ ప్రభుత్వ, ముసాగించబడెను. త్వరగ నావికాదళము, సైవ్వలు, బొక్కసము, న్యాయవిచారణా శాఖ,తంతి,టపాలా, మొదలగు