పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ మెరికా సంయుక్త రాష్ట్రములు.


నీగ్రోబానిసత్వము .


పదకొండవ అధ్యాయము ,

నీగ్రో
బానిసత్యము.

ఆఫ్రికా ఖండవానులగు నీగ్రోలు నల్లనివారు. వీరిని వేనకు వేలుగ యూరపుబండ వాసులగు తెల్ల,వారు బలవంతముగనో మోసముచేసియో బానిసలుగా పట్టుకొని తీసుకొని వచ్చి అమెరికాఖండములో తెల్లవారికి అమ్ముచుండెడివారు. ఒకప్పుడు అమెరికాలోని తెల్ల వారే ఆపికాకు పోయి నీగ్రోలను పట్టుకొని తెచ్చుచుండెడి వారు. నీగ్రోబానిసత్య వ్యాపారమువలన యూరపు అమెరికా ఖండములలోని తెల్లజాతులవారికి విశేషమగు లాభమువచ్చు. చుండెడిది. అమెరికా ఆఫ్రికాఖండములు యూరపు జాతుల వారిచే కనిపెట్టబడినప్పటి నుండియు నీగ్రోబానిస వ్యాపారము చేయబడినది. ఇంగ్లాండు దేశమును ఎలిజబెత్తురాణి పాలిం