పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

ఆమెరికాసంయుక్త రాష్ట్రములు


చుచున్న కాలమున సర్ జాన్ హాకిన్సుగారు ఆప్రికామండి నీగ్రోలను బానిసలుగా పట్టితెచ్చుటను ప్రారంభించెను. అమెరిశా ఖండములోని హిస్పానియా యందు నివసించుచున్న తెల్లవారు నీగ్రోబానిసలను విశేషము కొనుదురని విని ఆయన' 1562 వ సంవత్సరమున నీగ్రో బానిస వ్యాపారము వలన విశేషధనము సంపాదించవలెననికృత నిశ్చయుడై ఆ ఖండములోని సిగావిమోర్ తీరమునకు పోయి అచట కొంతకాలముండి కొంతవరకు కత్తులు,తుపాకులు మొదలగు -ఆయుధముల సహాయమువలనను కొంతవరకు ఇతర సౌధనముల వలనను మూడువందల నీగ్రోలను బాలిసలుగా పట్టుకొని పోయి హిస్పానియాలో విక్రయించి విశేష లాభమును గడించెను. మరుసటి సంవత్సగము లీస గుప్రభువు పెంబ్రోకు ప్రభువు మొదలగు రాజబంధువుల సహాయమున నీగ్రో బానిసన్యాపొ రమునకై యొక సంఘమును స్థాపించి నీగ్రోలను తెచ్చుటకు అయిదు పడవలను ఆఫ్రికా ఖండము నకు గొనిపోయెను. ఈ బందిపోటు దొంగ నరహంతకుడు " కేపు వర్దికి పోయి అచటి కాపరస్తులు మిగుల సాధువులుగను మర్యాదస్తులుగను ఉండుట చూచి వారినెట్టు లెన పట్టుకొని పోవలెనని యత్నించెముగాని వారీయనకు చిక్కలేదు. తరువాత రియోగ్రాండి తీరమునకు తనమనుష్యులతో కూడ పోయి ప్రతిదినమును అచటి గ్రామములను తగుల బెట్టుచు పారిపోవుచున్న కాపరస్తుల ను బాసిన లుగా పట్టుకొనుచువచ్చెను. వారిని అమెరికాలోని స్పైన్ వారికమ్మి చాలసొమ్మును తెచ్చెను. ఈధీరుని ఆంగ్లేయ జాతియు ఆంగ్లేయరాణి ఎలిజబెత్తును చాల గౌరవించిరి. రాణి ఆయనకు