పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

ఆమెరికా సంయుక్త రాష్ట్రములు


దావాలలో కూడ జ్యూరీవిచారణగలదు. జ్యూరీవిచారణ హక్కుల ముఖ్యమైనది. ప్రతిస్వతం త్రదేశములోను ఈ హక్కు పౌరులకుగలదు. ఏజిల్లాకు నేర ముగాని, ఆ స్తిగాని సంబంధించి యున్నదో ఆజిల్లా కాపురస్తులగు ఆరుగురు మొదలు పన్నెండువరకు సంఖ్యగల పెద్దమనుష్యులు ఉభయపక్షముల సాక్ష్యమును విచారణ చేసి తగాదాహంశము నిజమా అబద్దమా అని నిర్ణయించుటవలన చాలవరకు యదార్థము తేల గలదు, ఫిర్యాది ముద్దాయిలయొక్క... పూర్వపు స్వభావములసు సాక్షుల యొక్క ప్రవర్తనను ఆస్తిశ్వభావమును నేరముయొక్క సాధ్యాసాధ్యములను జ్యూరరులు సాధారణముగ ఎరిగినవారై యుందురు. కావున వారికి సత్వము గోచరించి నట్లు కొత్త వాడైన న్యాయాధిపతికి గోచగించడు. న్యాయాధిపతి శాస్త్రమునకు సంబంధించిన వివయములనుగూర్చి మాత్రము తీర్పు చెప్పును. పైన చెప్పబడిన పెద్ద క్రిమినల్ నేరములలో ముద్దాయి ముందుగా గ్రాండు జ్యూరీవలన విచా రించబడి వారు నేరమును నమ్మి సపుడుమాత్రము 'పెద్ద న్యాయాధిపతియొద్దకు విచారణకు పంపబడును. ఆవిచారణలో గూడ జ్యూరీ ఉండును.

ముద్దాయి మీద ప్రతి అభియోగములోను ఏటు నేరము వచ్చినదో అది అతనికి ముందుగా తెలపవలేను. అతనికి వ్యతి రేశముగా సాక్ష్యమిచ్చువారిని అతనియెదుట విచారించవలెను. అతడు వారిని ప్రశ్నలడుగుటకు హక్కు గలదు. అతడు కోరిన సాక్షు