పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

225

పదియవ అధ్యాయము


పుట్టిన ప్రతిపిల్లకును (మొగపిల్లగాడైనను ఆడపిల్ల అయినను) విద్యనిచ్చుభారమును ప్రభుత్వము వహించియున్నది. ఆ దేశములోని అన్ని తరగతులవారి పిల్లలయొక్క జీవితమును గూర్చియు, క్షేమమును గూర్చియు, అనగా వారి జననములు, మరణములు, రోగములు, ఆరోగ్యములు, నీతి, విద్య, పోషణము, మొదలగు సమస్త విషయములను గూర్చి సదా విచారంచేసి అవసరమైన చర్య తీసుకొనుటకు ప్రభుత్వములో నొక పత్యేక శాఖగలదు. దేశములోని పిల్లలే జాతీయ ధనములో ప్రధాన భాగమని ముపిల్లలను జాగ్రత్తగా పెంచుటయే ప్రధాన జాతీయ ధర్మమనియు నచటి ప్రభుత్వము గ్రహించినది. విద్యావిధానములో సాహిత్యమును శాస్త్రములను బోధించు , ప్రాధమిక, మధ్యమ, ఉత్తమపాఠశాలలును సర్వ కళాశాలలును అనేక ముండుటయే గాక, వర్తకము, వ్యాపారము, వ్యవహాయము వివిధములగు పరిశ్రమలు, మొదలగు వృత్తివిద్యను నేర్పుపాఠశాలలు లెక్కకు మించియున్నవి. శాన్ ప్రాన్ సిస్కోలో జరిగిన విద్యావిషయిక ప్రదర్శనలులో ప్రభుత్వ విద్యాశాఖవారు ఈ క్రింది విధముగా ప్రకటనమును కట్టినారు.


  • 1. తనపిల్లలకు చదువు చెప్పించని జాతి తనపిల్లలకు బాగుగా చదువు చెప్పించెడి జాతికి ఆర్ధిక దాస్యమును చేయును. విద్య లేని హేతువుచేత అనేక సార్లు జూతులు తమదేశములను పోగొట్టుకొనిరి.