పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

ఆమెరికా సంయుక్త రాష్ట్రములు


ప్రదేశములలోనుండి యభివృద్ధి చెంది నూట ముప్పది సంవ త్సరములలో లోకములో కెల్ల' భాగ్యవంతమయినవి. హిందూదేశములోని పరిశ్రమలు చేతిపనులు నశించి కేవలము వ్యవసాయముమీద ఆధారపడి యున్నది. సంయుక్త రాష్ట్రముల వ్యవసాయము, గనులు, పరిశ్రమలు, వర్తక వ్యాపారములు అనేక రెట్లుగా అభివృద్ధి గాంచి జాతీయ ధనము విశేషముగ హెచ్చుచున్నది. ఇరువదవ శతాబ్ద ప్రారంభము నకు లోకము యావత్తు యొక్క రాక్షసి బొగ్గలో మూడవ వంతును, రాగిలో సగమును, ఇమములో మూడవవంతును, సంయుక్త రాష్ట్రములలోని గసులలో తీయబడినది. సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వము వారు విదేశ పవిశ్రమల పోటీవలన తమ దేశములోని పరిశ్రమలకు నష్టము కలుగ కుండుటకై విదేశ సరుకులమీద పన్నులు వేయు చున్నారు. హిందూ దేశములోని ఆంగ్లేయ ప్రభుత్వము వారు హిందూదేశముయొక్క తలుపులు బాగుగా తెరచి విదేశ సరుకులను అడ్డు లేకుండ రానిచ్చుచున్నారు. విదేశ సరుకుల పోటీవలన హిందూ దేశములోని పరిశ్రమలు తలయెత్త కుండనున్నవి. పైగా హిందూదేశములో స్థాపించ బడిన బట్టల యంత్ర శాలలలో తయారయ్యేడి నూలు మీదను వస్త్రముల మీదను హిందూ దేశ ప్రభుత్వమువారు పన్నులు వేసియున్నారు.


విధ్యా
పద్దతులు.

సంయుక్త రాష్ట్రములలో ప్రభుత్వము వారును రాష్ట్ర ప్రభుత్వములును పిల్లల విద్యకొరకు ధనమును అమితముగా ఖర్చు పెట్టుచున్నారు. ఆదేశములో