పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

221

తొమ్మిదవ అధ్యాయము



. లందరును ప్రజలచే నెన్నకొన బడుదురు. అన్ని విషయములను తనిఖీ చేయుటకు ప్రజలచే కెన్న కొవబడు బోర్డు గలదు. మ్యునిసిపాలిటీల క్రిందకూడ పోలీసు, జైలు, న్యాయస్థానంములు గలవు. ప్రధానోద్యోగస్తు లందరును ప్రజలచే ఎన్న కొన బడుచున్నారు. మ్యూనిసిపాలిటీకి సంబధించిన విషయము లన్నింటిలోను మ్యునిసిపలు సభ్యుల సంఘము శాసనసభను బోలియున్నది. మ్యనిసిపలు చైరుమను (మేయరు ) కార్య నిర్వహణ భారమును వహించి యున్నాడు.


అమెరికాలో సంపూర్ణమగు మత స్వేచ్చ గలదు. అధ్యక్షుడు మొదలు 'యే యుద్యోగస్తుడును ఏ మతమునకు చెందినను చెందవచ్చును. అమెరికా ప్రభుత్వ బొక్కసము నుండి యే మత పోషణకొరకును సొమ్ము ఖర్చు పెట్టరు. సంయుక్త రాష్ట్రముల రాజ్యాంగ విధానము ప్రకారము నడుచు కొందమని అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, న్యాయాధిపతులు, మంత్రులు, మొదలగు గొప్ప యుద్యోగస్తులును శాసనసభ్యులను ప్రమాణము చేసెదరు. విదేశస్తు డెవడైన సంయుక్త రాష్ట్రముల పౌరుడు కావలెనని కోరినచో సంయుక్త రాష్ట్ర ములలో అయిదేండ్లయినను కాపురమున్నట్లును యే రాష్ట్రములో తాను దరఖాస్తు చేయుచున్నాడో అచట నొక సంవ త్సరమైన కావురమున్నట్లును మంచి ప్రవర్తన గలవాడై నట్లును ఒక రాష్ట్రములోని న్యాయస్థానములో దరఖాస్తుచేసి పౌరుస్వత్వములను పొందపలెను. అదివరకు ప్రభుబిరుద మున్నచో దానిని విసర్జించవలెను. - -