పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220

అమెరికా సంయుక్త రాష్ట్రములు


పరిపాలన, గ్రంధాలయములు, మొదలగు ప్రజల సౌఖ్యము, శాంతి, సుపరి పాలసములకు సంబంధించిన విషయము అన్నిటి లోను అధికారములు గలిగియున్నవి. పెద్ద పట్టణములలో మ్యునిసిపాలిటీలును (బరోలు), జిల్లాలకు జిల్లా బోర్డులును, (కౌంటీలు) గ్రామములలో (బౌనుషిపులు) యూనియనులు లేక గ్రామ పంచాయితీలు గలవు. ప్రతి గ్రామములోను (టౌనుషిపు) గ్రామ పంచాయితీ గలదు. వోటర్లందరును ప్రతి సంవత్సరము ఒకచోట చేరి పంచాయితీ దార్లను యితర యుద్యోగస్తులను ఎన్నుకొనెదరు. గ్రామముల పరిమితినిబట్టి ముగ్గురు మొదలు తొమ్మిది వరకు పంచాయితీదార్లెన్నుకొన బడుదురు. పంచాయితీదార్లతో పాటు (టౌను క్లర్కు) ఆసు రికార్డులను దాచు వుద్యోగస్తుడు, కోశాధిపతి, పన్నులు వేయు ఆస్పెసర్లు, పన్నులు వసూలు చేయు అధికారి, పాఠశాల తనిఖీ దార్లు, పోలీసు ఉద్యోగస్తులు, గ్రంథాలయ పాలకులు, బీదల విచారణాధికారి, రాజమార్గముల యుద్యోగి, మొదలగు ఉద్యోగస్తు లందరిని ఎన్నుకొనెదరు. ఓటర్ల సభలు సంవత్సరములో రెండుమూడు సారులు జరుగును. ఆ సభలలో సుద్యో గస్తులు తాముచేయు పనినిగూర్చి ప్రశ్నించబడి జవాబులు చెప్పవలసి యుందురు. జిల్లా బోర్డు క్రింద గ్రామ పంచా యితీ లండును. జిల్లా పోలీసు, జయిళ్ళు, జిల్లా యొక్క క్రిమినలు సివిలు. న్యాయస్థానములు, తీర్పులను అనులు జరుపు షెరిఫులు, రోడ్లు పారిశుద్ధ్యము, విద్య, మొదలగు వివిధవిషయములు జిల్లా బోర్డుల కింద నుండును. న్యాయాధిపతులు, షేరి వులు, పోలీసు వుద్యోగస్తులు, మొదలగు పెద్ద యుద్యోగస్తు