పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

అమెరికా సంయుక్త రాష్ట్రములు


కొను అధికారము) ఇవ్వబడినవి. కొన్ని రాష్ట్రములలో స్త్రీలకుకూడ ఎన్నిక ఆధికారము లివ్వబడినవి. చాల రాష్ట్ర ములలో పౌర స్వత్వములను కోరిన విదేశస్తులకును ఓటు చేయు అధికారమివ్వబడినది. ఓటర్లు కొన్ని రాష్ట్రములలో వ్రాయను చదవను నేర్పినవారుగనుండవలెను లేదా కొంత ఎక్కున ఆస్తి గలవారుగ నుండవలెను మరికొన్ని రాష్ట్రము లలో కొంతపన్ను చెల్లించువారుగనుండవలె. అన్ని రాష్ట్ర ములలోను ఓటుచేయు అధికారమును పొందకముందు కొంతకాల మారాష్ట్రములో కాపురముండి తీరవలెనని శాసించబడెను, గాని ఎంత కాలము కావుర ముండవలెనను విషయమున కొన్ని రాష్ట్రలలో మూడు నెలలు మొదలు మరికొన్ని రాష్ట్ర ములలో రెండున్నర సంవత్సరములవరకు వివిధ రాష్ట్రములలో వేరు వేరుధముల నిర్నయించబడినది.


శిష్టసభకు ఆరుసంవత్సరముల కొకసారి ఎన్నికలు జరుగును, గానీ ప్రజాప్రతినిధి సభవలె అందరిసభ్యుల ఎన్నికలు ఒక్కసారిజరగవు. శిష్టసభ లోని మూడవవంతు సభ్యులు ప్రతి రెండు సంవత్సరములకును ఎన్నుకొనబడుదురు. ఈసభలో రాష్ట్రమున ఇద్దరు సభ్యుల చొప్పున రాష్ట్ర శాసన సభలచే ఎన్నుకొనబడిన ప్రతినిధులుందురు, సభ్యుడు ముప్పదిసంవ త్సరములకు తక్కువగాని వయస్సుగలవాడుగను తొమ్మిదివంవ త్సరములు సంయుక్త రాష్ట్రముల పౌరుడుగను ఎన్నుకొనబడిన రాష్ట్రములో కాపుర మున్న వాడుగను ఉండి తీరవలెను. ఇందు వలన ప్రజాప్రతినిధి సభ దేశములోని యావన్మంది ప్రజల యొక్క ప్రానిధ్యమును వహించుచు నమ్మిష్ఠి జూతీయ భావమును