పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

అమెరికా సంయుక్త రాష్ట్రములు

అమెరికా ప్రజలు
ఆత్మ విశ్వాసమును
గోల్పోయిరి.

లనియు, యుద్ధము త్వరలో మగియ నేరదనియే నమ్ను చుండిరి. కారొలీనా గోల్పోయి, ఆ రాష్ట్రములలో రాజభక్తులకు ను దేశభక్తులకును నప్పుడప్పుడు యుద్దములు జరిగి యొక రిపై నొకరు ఘోర హత్యలు గామించుకొను చుండిరి. క్రమముగా రాజభ క్తుల సంఖ్య క్షీణించెను. కాని దేశీయ మహాసభ హరివద్దనుండిన ద్రవ్యమంతయు జనరివరకు ఖర్చయిపోయినది. జూను 1 వ తేదీ వరకు నిరునది వేల డాలకులు మాత్రము రాష్ట్రముల నుండి వసూలయ్యెను. వాషింగుట సువద్ద పది వేల సైనికులు మాత్ర ముండిరి. జీతము జీతములొరకు తొందర జేయుచుండిరి. ఇంతలో నూతనాంగ్ల సేనాధ్యక్షు డమెరికాకు జే రెను. సంధి రాయబారములను పంపసాగెను. కాని వాషింగుటనుగాని, దేళీయ మహాసభ వారుగాని, ఆయబాగములు :నిజమైనవని నమ్ముట లేదు. బ్రిటిషు వారు తమమీదికి దండెత్తుచో సంరక్షణ చేసికొనుటకు తగిన సైన్యములు లేవనియే వాషింగ్టను వ్రాయుచుండెను. ఈ సమయమున వాషింగ్టను వద్ద నుండిన సేనలలోకూడ నసంతృప్తి మిగుల వ్యాపించియండెను. యెటులనో తిరుగబాటులు జరుగకుండ వాషింగ్టను చేసెను. ఆర్థిక వ్యవహారమును చూచుచున్న రాబర్టు మారిసు పెట్టుబడి పెట్టిన సొమ్మును తిరుగ నిష్వవలసినదని దేశీయ మహాసభ వారి నడుగగా సొమ్ము నివ్వకపోవుటయేగాక కఠిన ముగ మందలించిరి. సైనికులును సైనికోద్యోగులను కలసియొక సభచేసి తమకు దేశీయ మహాసభ వారివలన న్యాయము కలుగ నేరదుగావున వాషింగుటను అమెరికాకు రాజుగ నేర్పడు