పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ అధ్యాయము

187


ట యుత్తమమని తీర్మానించి రాజరికమును ప్రజా పరిపాలన మును కలిసియుండట మంచిదనియు జాషింగ్టను సమెరికాయొక్క కిరీటాధిపత్యము నంగీకరించ వలయుననియు కోరిరి. వాషింగ్టను అమెరికా యొక్క. స్వతంత్రమగు ప్రజూపాలన మగుటయే తన యుద్దేశ్యముగాని తాను గాని మరియొకరుగాని యె ప్పటికిని రాజుగ నేర్పడగూడదని చెప్పి వారినందరిని గట్టిగా మందలించి పంపి వేసెను

సంధి రాయ
బారములు.

ఆంగ్లేయ మంత్రీ, అమెరికా వారితోడను పరాసు వారి తోడను సంఘ రాయబారములు జరుపుచుం డెను. ఆంగేయునౌకాసేనాని పశ్చిమ యిండియా ద్వీపములవద్ద పరాసు నౌకాళము నోడించి, నౌకాసేనానిని తొమ్మిది యుద్ద నౌకలతోగూడ పట్టుకొనెను. కాని ఆంగ్లేయల బహమా' ద్వీపములను స్పైనువారు వశపరుచు కొనిరి. ఆంగ్లేయ ప్రధాసము శ్రీ బక్కింగుహం చనిపోయి నందున అమెరికా వ్యవహారములను చూచుచున్న 'హెల్బర్ను ప్రధాన మంత్రిత్వమును కూడ వహించెను. కీర్తిశేషులగు విలియంపిట్టు కుమారుడగు పిట్టు యువకుడయ్యను ఆర్థిక మంత్రి యయ్యెను. ఈలోపుగా జార్జియా రాష్ట్రమునుండి ఆంగ్లేయులు తరిమి వేయబడిరి. ఆ రాష్ట్ర మంతయు జూలై 11వ తేదిన సమెరికనుల వశమయ్యెను. ఆరాష్ట్రమమందుండిన రాజు భక్తులు ఫ్లోరిడాకు పారిపోయిరి. ఆంగ్లేయ సేనలు ఛార్లెనుటన లో చేరిరి. స్పైన్ వారు చాల సైన్యములతో చాల కాలము జి బ్రాలల్డును ముట్టడించిరిగాని తుదకు 1782 సంవత్స రము సెప్టెంబరు 18 వ తేదిన ఆంగ్లేయులు ముట్టడిని వదలించు