పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

అమెరికా సంయుక్త రాష్ట్రములు


రాజభక్తులు నా
శనము గావింపబడిరి ఆంగ్లేయులు
దక్షిణ కారోలినా నాక్రమించుట.

తరువాత శత్రువులు దక్షిణ కారొలీనా రాష్ట్రమునాకమించ తలచిరి. అమెరికను రాజభక్తుల సేసలు ఆంగ్లేయులతో కలయుటకై పోవు 14వ ఫిభ్రవరి నాడు వీరిని అమెరికను సేనలు ముట్టడించి చాలమందిని నాశనము గావించెను. రెండువందలమందిమాత్రము తప్పించుకొనిపోయి యాంగ్లేయులతో చేరిరి. ఈ సమయమున ఖయిదీలుగ చేయబడిన డెబ్బదిమంది రాజభక్తులను అమెరికను సైనికోద్యోగులు దేశద్రోహ నేరమున విచారించి అయిదుగురికి ఉరిశిక్షయు తక్కినవారికి కఠిన ఖైడును విధించిరి. కాని మార్చి 8వ తేదీన బ్రై రు. ఆర్చీవద్ద అమెరికనులను ఆంగ్లేయు లోడించిరి. మే నెలలో ఆంగ్లేయ నేనలు ఛార్లెసుటను వరకు నెట్టుకొని పోయి దక్షిణ కారోలినా నాక్రమించెను. ఆ రాష్ట్రమున ఆంగ్లేయ సైనికులు ప్రజలను దోచుకొనియు పెక్కు అవమాన కృత్యములను చేసియు ప్రజాపీడనము గావించిరి. వేసంగివచ్చుటచే సత్యధిక మగు సుష్ణమును సహించ జాలక యభయ పక్షములవారును కొంతకాలము యుద్దము పొగించ లేదు.

ఎర్రయిండియను
అమెరికనులచే
నాశనము చేయుట.

ఈ సమయముననే సయిదు వేలమంది అమెరికను సైన్యములు సల్లివనుసేనాని : కింద దేరి వెడలి, మస్కిహానా, గిన్నీ నదులమధ్య నున్న ఎరయిండియనుల దేశమునంతను నాశసముచేసి ఆక్రమించుకొనెను, అక్కడ .