పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ఆధ్యాయము

137


{అమెరికాకును
ఫ్రాన్ సుకును స్పైన్ కును
వడంబడికలు}

1778 సంవత్సరము ఫిభ్రవరి 6వ తేదీన ప్రాసు దేశప్రభుత్వమునకును అమెరికా సంయుక్త రాష్ట్రములకును నొడంబడికెలు జరిగెను. పరాసు ప్రభుత్వము అమెరికా సంయుక్త రాష్ట్రముల స్వతంత్రము సంగీకరించి, సంయుక్త రాష్ట్ర ములవారు సంపూర్ణమగు స్వతంత్రమును పొందువరకును నిలుపదల చేయకుండునట్లును ఈ యుద్ధములో పరాసువారు పూర్తిగ సహాయము చేయునట్లును నోడంబడిరి. స్పైన్ రాజు కూడ నీసంధి కంగీకరించెను. గాని ఇంకను సంధిపత్రముపై సంతకము చేయ లేదు. ప్రారాసు దేశముతో చేసుకొనిన సంధి వలన నమెరికా స్వాతంత్ర యుద్ధమునకు నూతన వికాసము కలిగెను.