పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

'అమెరికా సంయుక్త రాష్ట్రములు



మగు దుఃఖము కలిగెను . ప్రధాన మంత్రి నార్తు ప్రభువు భోజనముగాని నిద్రగాని లేక విచారములో మునిగెను. అమెరికను యుద్ధమును వదలి వేయపలెనా లేక తాసుమత్రి వదవిని త్యజించవలెనాయని నూలోచించు చుండెను ఆంగ్లేయ రాజునకు కలిగిన పరితాపముకు మేరలేదు. పార్లమెంటులో గొప్ప కలవరము కలిగెను. కొందరు సభ్యులు వెంటనే ఆమెరికావారి స్వాతంత్యమునంగీకరించి వారితో మైత్రి పొందవలసినదని చెప్పిరి. పార్లమెంటు సభ 1778వ సంవత్సరం జనవరి 20 వ తేదీవరకు నిలుపుదల చేయబడెను. ఈలోపున నాంగ్లేయ రాజు సంధి షరతులను గూర్చి సంధాన పరచుటకుగాను ఫ్రాన్సు దేశములో నున్న అమెరికాప్రతినిధి బెంజమిను ఫోన్కు లినుకు న్నేహితుడగు హట్టను వద్దకు రాయబారులను పంపెనుగాని హట్టనుని సంప్రదించగ నీ సందర్భమున సంధికుదురుట యసంభవమని ఫోన్కులిను చెప్పినారు. జనవరి 20 వ తేదీన పార్లమెంటు సమావేశమయిననాడు వారు తిరిగి చర్చజరిగెను. మెటనే ఆమెరికనులకు స్వాతంత్ర్య మిచ్చి రాజీపడవలసినదని కొందరు సభ్యులు చెప్పిరి. అమెరికాకు స్వాతం త్యమిచ్చుటకు విల్లియం పిట్టు సమ్మతించలేదు. యద్దముమాని ఆంగ్లేయ రాజ్యముక్రింద సమెరికా నుంచుకొనుటయే ఆయన యుద్దేశ్యము. ప్రధాన మంత్రి రాజీనామా నిచ్చెదనని చెప్పెనుగాని రాజు రాజీనామా నివ్వకుండ నిర్బంధించెను. "ఇప్పుడ మెరికనులకు లోబడుట ఆంగ్లేయుల కగౌరవము గాన యుద్దమును జరుపవలసినద"నియే పార్ల మెంటు వారు తుదకు తీర్మానించిరి.