పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

ఆమెరికా సంయుక్త రాష్ట్రములు


air యుద్ద విషయమున సమస్తకార్యములు చేయుటకును సంపూర్ణాధికారమిచ్చిరి. బెంజమిను ఫ్రాంక్లిలినును ఫ్రాన్సునకు బంపిరి. ఆయన పరాసు చేశీయుల సానుభూతిని సుపాదించు చుండెను. ఫ్రాన్సు, స్పైన్, దేశములతో నమెరికనులు. వాణిజ్యము సలుపునటుల యొడంబడికలు చేసికొనిరి.

వాషింగ్టను ఆంగ్లేయుల
నోడించుట


1778వ సంవత్సరము 25వ డిశంబరు రాత్రి వాషింగ్టను రెండు వేల నాలుగు వందల అమెరికను సెనికులతో మంచుతో కప్పబడియున్న డెలవేరు నదిని దాటి న్యూ జర్నీ రాష్ట్రములో ప్రవేశించి ఆకస్మికముగాట్రెర్ టను వద్దనుండిన ఆంగ్లేయ సేనలపై బడెను. ఆంగ్లేయు లోడిపోయిరి. ఆంగ్లేయ సైన్యాధిపతి గాయములచే మరణించెను. వెయ్యిమంది. ఆంగ్లేయులు వాషింగ్టను చేతిలో జిక్కిరి. వీరిని బందీలుగాపట్టుకొని వాషింగ్టను ఖందీల తోడను తన సైన్యములతోడను తిరిగి నదిని దాటి న్యూజర్సీలో చేరెను. మిగిలిన ఆంగ్లేయు పై నికులు ట్రైన్ టనును వదలిపోగానే వాషింగ్టనిచట చేరి స్థావర మేర్పరచుకొనెను, దేశీయ మహాజన సభ వారు క్రొత్త సైస్యముల నేర్పరచి వాషింగ్టను వద్దకు బంపిరి, ఆంగ్లేయ సేనాధిపతి కారన్ వాలీసు ప్రభువు సైన్యములతో వచ్చి 1777వ సంవత్సరము 13వ జనవరి నాడు. అమెరికనులను మట్టడించెను . ప్రిన్సటను వద్ద కారన్ వాలీసునకును వాషింగ్టనుకును యుద్దము జరిగెను వాషింగ్టముకు జనుముకలిగెను. వాషింగ్టను తన సైన్యములతో మారిన్ టౌను