పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ అధ్యాయము

123


ల్వేనియా రాష్ట్రములోనికి చేరెను. అదృష్ట వశమున ఆంగ్లేయ లింతదూరము రాలేదు. ఇంతలో కెనడా నుంచి ఆంగ్లేయ సేనలు వచ్చి క్రౌను పాయంటును వశపర్చుకొనెను. న్యూయార్కు లోనుండిన ఆంగ్ల సైస్యములు రోడు అయిలండును స్వాధీనము పొందెను.

వాషింగ్టనుకు కష్టములమద్య
ధర్మము జయించునను విశ్వాసము.


ఇట్లు 1776వ సంవత్సరాంతముకు ఆంగ్లేయుల కే ప్రతి వాషింగ్టషకు దిక్కు సను జయములు కలిగి 304 గురు అమెరికను సైనిరోద్యోగులును 4564 మంది అమెరికను సైనికులును ఆంగ్లేయులచే ఖయిదు చేయబడిరి; రోడు అయిలాండు, న్యూజర్సీ, రాష్ట్రములు ఆంగ్లేయులకు స్వాధీనమయ్యెను. పెనిసిల్వనియా పైకి అంగ్లేయులు దండు వెడలుటకు సిద్ధముగ నుండిరి. దేశీయ మహాజనసభ కార్యస్థానమిచట నుండి బాల్టిమోరు నకు మార్చిరి. అమెరికను 'సర్వసేనాధ్యక్షుడగు ' వాషింగ్టసుసందు ఆయన క్రింద నుండిన చాలమంది యుద్యోగస్తుకు విశ్వాసము నశించెను. ఎటుచూచినను" అధైర్యము, అవిశ్వాసము, నిరాశ ప్రబలియుండెను. గాని వాషింగ్టనుకు మాత్రము తమయుద్యమము ధర్మమైన దయిసందున తప్పక జయముకలుగు సని దృఢమయిన నమ్మకముండెను. దేశీయమహాజన సభ వారును ధైర్యమును వదలక వాషింగ్టనునందు అపనమ్మకము పొందక ధర్మమూర్తియగు పరుమేశ్వరుని మీద భారము మోపి సకల ప్రయత్నములు చేయుచుండిరి. వాషింగ్టసుకు