పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

అమెరికా సంయుక్త రాష్ట్రములు


లకు చేరెను. అక్కడ ఆంగ్లేయులు ముట్టడించగా నిలువ లేక నార్తు కాసిలుకు పోయెను. అక్కడ నుంచి తిరిగి యెటులనో హడ్సను నదిని దాటి వాషింగ్టను కోట కెదురుగనున్న లీకోటలో ప్రవేశించెను. వాషింగ్టను కోటను నవంబరు 16వ తేదీన నలువైపుల నుండియు సధిక సంఖ్యాకులగు నాంగ్లేయ సైన్యములు ముట్టడించగ లోపలనున్న అమెరికను సైనికులు లోబడిరి. 2818 మంది అమెరికను సైనికు లాంగ్లేయులచే ఖయిదుచేయబడిరి. ఆమెరికనుల యుద్ధసామాను లాంగ్లేయులకు చిక్కెను. వాషింగ్టనుకోట ఆంగ్లేయుల వశమయ్యెను. వాషింగ్టను సేనాని ఏమియు చేయజాలక తన సైనికులు శత్రువులచే జిక్కుటచూచి పసిపిల్లవానివలె ఊరక రోదనముచేసెను.

వాషింగ్టను సేనలతో
పారిపోవుట.

మూడుదినముల తరువాత 'కారన్ వాలీసు ప్రభువు యొక్క సేనాధిపత్యము క్రింద ఆరు వేల ఆంగ్లేయనేనలు హడ్సమనదిని దాటి వాషింగ్టనులో స్థావర మేర్పరచుకొనిన లీకోటను ముట్డడించిరి. వాషింఘ్టను సేనాని త్వరితముగ నీకోటను శత్రువులకు వదలివైచి డేరాలు, సామానులు, కందకములు త్రవ్వుకొనుటకు పరిక కములు మొదలగున వేమియు లేకనే మూడు వేల సైన్యములతో న్యూజర్సీ రాష్ట్రములోనికి పారిపోయెను. ఆంగ్లేయ సైన్యములు వెంబడించి తరుముచుండెను. న్యూజర్శీప్రజలు ధైర్యమును కోల్పోయి వాషింగ్టను కెట్టినహాయము చేయుటకును సాహసించలేదు. వాషింగ్టను డెలవీరు నదిని దాటి పెనిసి