పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

అమెరికా సంయుక్త రాష్ట్రములు


గాని మనమేమియు చేయజాలమనియు కొంత కాలమువరకు చూత్రమే కొలువులో సుందు పని చేరిన ఐచ్ఛిక భటులను నమ్మిన యెడల మోసము వాటిల్లుననియు కూడ నాయన గట్టిగ వ్రాసెను. కనెక్టికటు రాష్ట్రము నుండి వచ్చిన ఆరు వేలమంది సైనికులు మాత్రము నిలిచియుండిరి. మిగిలినవారు సేనలను విడిచి గృహములకు జనిరి. సైనికులలో నాలుగవ వంతుకు అనారోగ్యముగ కూడ నుండెను. అందరికిని రెండు నెలల, జీతము బాకీపడినది. ఇచ్చుటకు సొమ్ము లేదు.

అమెరికనులు న్యూయార్కును
వదిలి పాఅరిపోయిరి

ఆంగ్లేయ సైన్యములు విజృంభించి న్యూయార్కు అమెరికనులు న్యూయార్కు పట్టణమును ముట్టడించుటకు తలపడెను. 11 వ సెప్టెంబరు తేదీన అమెరిక నులకును ఆగ్లేయులకును సంధి కుదర్చవలెనని ఉభయ పక్షముల ప్రముఖులును స్టేటను ద్వీపములో చేరిరి.కాని ఏమియు కుదరలేదు. 18వ తేదీనాడు ఆంగ్లేయ సైన్యములు న్యూయూర్కు ముట్టడిని ప్రారంభించెను. రెండుదినములు కాగనే అమెరికను సేన్యములలో నిస్పృహజనించినది. అమెరికనులు సైన్యములను విడచి పలాయనమగుచుండిరి. వాషింగ్టన్ నెంత ప్రోత్సాహించిపను ఆగలేదు. ఎనిమిదిపటాలముల సైనికులు, పారిపోయి ఖాళీ అయినవి. ఆంగ్లేయులమీద తుపాకులను గూడ కాల్చకుండ పారిపోయిరి. వాషింగ్టను ఖడ్గమును తుపాకిని ధరించి శతృవులముందు నిలచి తన సైనికులను హెచ్చరించుచుండెను. ప్రయోజనమేమియు లేదయ్యెను. అమెరికను సేనానులందరును కలసి న్యూయార్కు పట్టణము వదలిపోవు