పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ అధ్యాయము

107

దేశీయ మహాజనసభవారు అమెరికను నౌకాదళ మేర్పరచి

{అమెరికనుల
అపజయము}

దాని నిబంధనలను చేసిరి. ఆంగ్లేయసై నికుల కాహారము తీసుకొని పోవు పడవలసు పట్టుకొనుటకు తీర్మానించిరి. ఆంగ్లేయ సైన్యములను వదలి అమెరికను పరుసచేరిన మాంగము సేనాని కొంత మంది అమెరికను సైనికులతో ఆంగ్లేయ రాజ్యముగు కనడా పైకి దండెత్తి నవంబరు 12వ తేదీన మాంటురీయలు పట్టణమును పట్టుకొనెను. అక్కడనుస్న వరాసులుసు ఎర్రయిండియనులును కూడ అమెరికనులకు స్నేహభావమును చూపిరి గాని అక్కడ చేరిన తరువాత మాంగమరికి నూతన కష్టమెదుర్కొ నెను. తన కింది సెనికులలో చాలమందికి గడువయిపోయినందున తమ స్వగామములకు వెళ్లెదమని పట్టుబట్టిరి. ఇంతలో ఆర్నల్డ సేనానిని పదకొండు వందల మంది అమెరికను సేనలతో కెనడా లోని క్విచకు పట్టణమును ముట్టడించుటకు బయలు దేరెను. గాని తోవలో నాహారపదార్తము లయిపోయెను. కొందరు సైనికులు విడిచి వెళ్లిపోయిరి. మిగిలినవారు తిండి లేక ఎద్దులను కుక్కలకు చంపుకొని తినిరి. తరువాత దుంపలను తినిరి. చెట్ల బెరడులను తినిరి.. ఇవియు దొరకక రెండు రోజులు పూర్తిగ నుపవాసముచేసిరి. చివర నెటులనో ఆర్నల్డు క్విచికు చేరెను. అప్పటికి తొమ్మిది వందల సైనికులుండిరి. వస్త్రములుగాని తగిన అయుధసామానుగాని లేకుండెను. ఇట్టివారితో నేమియు చేయు జాలక కనిపెట్టుకొని యుండగా మాంగుమరీ నేనాని మూడు వందల మంది సైనికులతో వచ్చి కలసెను. ఈస్వల్ప సైన్యముతో, అమెరికనులు ,